ఎడారి దేశంలో చిక్కుకున్న వలస బిడ్డలకు ‘తెలంగాణ ఎమిరేట్స్’ ఆపన్నహస్తం
దుర్భరస్థితిలో ఉన్న 120 మంది గుర్తింపు
స్వదేశానికి పయనమైన 32 మంది బాధితులు
ఈటీసీఏ వ్యవస్థాపకుడు కిరణ్‌వెల్లడి
దుబయి : ఏడారి దేశంలో చిక్కుకున్న తెలంగాణ నిరుపేదలను సొంతగడ్డకు పంపేందుకు ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ఈటీసీఏ) ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమెస్టీ ప్రక్రియలో భాగంగా గల్ఫ్‌లో చిక్కుకున్న తెలంగాణ ప్రాంత నిరుపేదలను గుర్తించి వారిని స్వదేశానికి పంపుతున్నారు. స్వదేశంలో పాలకుల విధానాలతో ఉపాధి కరువై, గల్ఫ్ ఏజెంట్ల మోసానికి బలై విజిటింగ్ వీసాలతో ఎడారి దేశానికి వచ్చిన తెలంగాణ కూలీలు ఆమెస్టీ నిబంధనలతో అక్కడ పనిచేసుకోలేక స్వదేశానికి వెళ్లేందుకు డబ్బులు లేక దయనీయ జీవితాలు గడుపుతున్నారు.
ఉన్న ఊళ్లో కొద్దిపాటి, భార్య మెడలో ఉన్న ఆభరణాలు అమ్మి లక్షల రూపాయలు అప్పులు చేసి పుట్టెడాశలతో ఎడాది దేశానికి చేరిన నిరుపేదలకు అక్కడి నిబంధనలు ఉపాధి లేకుండా చేశాయి. దుబయికి చేరిన తర్వాత
మోసపోయామని తెలుసుకున్న నిర్భాగ్యులు దొంగచాటుగా దొరికిన పని చేసుకొని పొట్టపోసుకున్నారు. యూఏఈ సర్కారు ఆమెస్టీ నిబంధనలు కఠినతరం చేయడంతో వారికి ఎక్కడా పనిలేకుండా పోయింది. కనీసం సొంతగడ్డకు తిరిగి చేరుకునేందుకు జేబులో చిల్లిగవ్వలేకుండా పోయింది. అలాంటి వారికి చేయూత నివ్వాలని తలచిన ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వారిని గుర్తించే పనిలో పడింది. అసోసియేషన్ వ్యవస్థాపకుడు పీచర కిరణ్‌కుమార్, సభ్యులు మ్యాదం మహేశ్వర్, కొండ శ్రీనివాస్, పడాల లింగారెడ్డి, గంతుల నరేశ్, ర్యాపని రమేశ్, ధనరేకుల మల్లయ్య, గాంధారి సత్యనారాయణ, మల్లేశ్ యూఏఈలోని షార్జా, సోనాపూర్, సత్వ, అవీర్‌లోని నిర్వాసితుల శిబిరాలను సందర్శించి 120 మందిని గుర్తించింది.
ఆమెస్టీ ప్రక్రియకు సంబంధించిన వివరాలు అందించి ఔట్ పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పత్రాలు, రిటర్న్ టికెట్లు అందించేందుకు ముందుకు వచ్చింది. యూఏఈలో స్థిరపడిన తెలంగాణవాదుల నుంచి విరాళాలు పోగు చేసి వారిని స్వదేశానికి పంపిస్తుంది. గత శనివారం 32 మందికి టికెట్లు అందజేసి వారిని స్వదేశానికి పంపినట్లు కిరణ్‌కుమార్ తెలిపారు. వీరి సంకల్పాన్ని అభినందించిన రుద్ర శంకర్ (సుష్మ ఎస్టేట్స్), యూకే టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఐదు టికెట్ల చొప్పున పంపాయి. 44 మంది బాధితులను విడతల వారీగా ఈనెల 14, 17, 21, 31 తేదీల్లో స్వదేశానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈటీసీఏ బాధితులకు, దాతలకు మధ్య వాలంటీర్‌గా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. బాధితులు, దాతలు తమను నంబర్లు : 00971 55 7156057, 00971 55 8826905లో సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా టికెట్లు అందజేసిన బాధితుల వివరాలు ప్రకటించారు. యదారపు థామస్(ముచ్చెర్ల, కోనరావుపేట, కరీంనగర్), అంబటి శ్రీనివాస్ (దాచారం, ఇల్లంతకుంట, కరీంనగర్), కఓల్ల సురేందర్ (రాఘోత్తంపల్లి, దుబ్బాక, మెదక్), గొట్టిగల్ల నర్సయ్య (గూడూరు, ముస్తాబాద్, కరీంనగర్), బాదావత& బాలు (బావుసాయిపేట, కోనరావుపేట, కరీంనగర్), మాదరి పోశెట్టి (ముజ్గిన్యూ, నిర్మల్, ఆదిలాబాద్), బదావత్ శర్మన్ (గోగుల్ తండా, కోనరావుపేట, కరీంనగర్), అజేలూ జనార్థన్ (డిచ్‌పల్లి, డిచ్‌పల్లి, నిజామాబాద్), గుర్రం లింగయ్య (మూటపల్లి, రాయికల్, కరీంనగర్), మామిడి రాజం (యూసఫ్‌నగర్, కోరుట్ల, కరీంనగర్), బద్దిపగడ ఎల్లారెడ్డి (దుబ్బాక, దుబ్బాక, మెదక్), సూదుల బుచ్చయ్య (బీబీరాజ్‌బిల్లి, కరీంనగర్), ఉల్లెంగా ఎర్రన్న (పుప్పాలపల్లి, జక్రాన్‌పల్లి, నిజామాబాద్), పోతుల అమృతం (మల్లారెడ్డిపేట, కరీంనగర్), దాసరి గంగాధర్ (ఆర్మూర్, ఆర్మూర్, నిజామాబాద్), దోనూరి లచ్చన్న (తాళ్ల ధర్మారం, సారంగపూర్, కరీంనగర్), ఆరె సత్తయ్య (బార్పూర్, సారంగపూర్, కరీంనగర్), శివరాత్రి వెంకటస్వామి (రామగుండం, కరీంనగర్), గొట్టం సుధాకర్ (రావురుకుల, సిద్దిపేట, మెదక్), మాచ దుర్గయ్య (ఆవునూరు, ముస్తాబాద్, కరీంనగర్), గారిగంటి రాజేశం (ర్యాలపల్లి, కరీంనగర్), అద్దిగే లక్ష్మన్ (చిన్నమెట్‌పల్లి, కోరుట్ల, కరీంనగర్), పెట్టెం కృష్ణ (పోతంగల్ కాలాన్, నిజామాబాద్), దుబ్బెట కృష్ణహరి (ఆవునూరు, ముస్తాబాద్, కరీంనగర్), దబ్బడ చంద్రయ్య (సుద్దాల, కరీంనగర్), మాసిన శివారెడ్డి (గుర్రాగొండి, చిన్నకోడూరు, మెదక్), మ్యాకల గంగారాం(శెకల్ల, గొల్లపల్లి, కరీంనగర్), బర్ల ఆశన్న (యూసుఫ్‌నగర్, కోరుట్ల, కరీంనగర్), ముక్కెర భూమయ్య (యూసుఫ్‌నగర్, కోరుట్ల, కరీంనగర్), వొల్లాల నర్సయ్య (అనంతారం, సిరిసిల్ల, కరీంనగర్), బత్తుల శ్రీను (బొమ్మదేవపల్లి, బీర్కూరు, కరీంనగర్)
టికెట్లు ఇవ్వడానికి ఆర్థిక సహాయాన్ని అందించిన వారు
మామిడి శ్రీనివాస్‌రెడ్డి ( 10 టికెట్లు), చింతల రాయమల్లు (యాబీష ట్రావెల్స్) ( 5 టికెట్లు), కొండం అశోక్‌రెడ్డి (2 టికెట్లు), కొండ శ్రీనివాస్ ( 2 టికెట్లు) , పీచర కిరణ్‌కుమార్ ( 1 టికెట్ ), మ్యాదం మహేశ్వర్ ( 1 టికెట్ ),పొన్నాల రవిసంతోష్ ( 1 టికెట్ ), భవాని బాబూరావు ( 1 టికెట్ ),కటుకం సాయిచందర్ ( 1 టికెట్ ),ధనరేకుల సంతోష్ ( 1 టికెట్ ), పస్నూరి వెంకటేష్ ( 1 టికెట్ ), రెండ్ల శ్రీనివాస్ ( 1 టికెట్ ), అశోక్ పర్రె ( 1 టికెట్ )