ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ

ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కళాశాల జంతు శాస్త్రం అధ్యాపకులు ఆంజనేయులు విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి లక్షణాలు,నివారణ మార్గాలు, ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి సంబంధించిన డాటా మొత్తం విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఎం రమేష్ లింగం మాట్లాడుతూ ఎయిడ్స్ భూతాన్ని తరిమేయడానికి విద్యార్థులు ప్రజలకు అవగాహన కలిగించాలని దీనికి నివారణ ఒక్కటే మార్గం అని మందు లేదని సూచించారు.ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ద్వేషించకుండా వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరారు.విద్యార్థులు గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి నిర్మూలన కొరకు అవసరమైన నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు రామాంజనేయులు గౌడ్,నర్సింలు అధ్యాపకులు భాగ్యలక్ష్మి,గోవర్ధన్ శెట్టి, శ్రీనివాసులు,తిమోతి ,శ్రీనాథ్, జయరాం,రమేష్ అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు