ఎన్జీ రంగా వర్సిటీలో ఉద్రిక్తత

తెలంగాణ వ్యక్తిని వీసీగా
నియమించాలని డిమాండ్‌
విద్యార్థులపై లాఠీచార్జి
పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి):
ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీలో ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. బుధవారం ఎన్జీ రంగా జయంతి వేడుకులను విద్యార్థులు అడ్డుకొన్నారు. బుధవారం ఎన్జీ రంగా వేడులకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇన్‌ఛార్జి వీసీని విద్యార్థులు అడ్డుకున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తినే వీసీగా నియమించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు చెందిన వీసీని నియ మించే వరకూ జయంతి వేడుకలను జరపడానికి వీలులేదని వారుపట్టుబట్టారు. దీంతో వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాల య్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసు లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు కోడిగుడ్డు విసిరారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.