ఎన్టీఆర్ గృహాలు ఆడబిడ్డలకు కానుక
– అందరి సొంతింటి కల నెరవేర్చడమే తన లక్ష్యం
– గాంధీ జయంతి నాటికి మరో 3లక్షల ఇళ్లు నిర్మిస్తాం
– పేదలకు ఇంటిజాగాకోసమే రూ.500 కోట్లు ఖర్చుచేశాం
– ఇండ్ల నిర్మాణాల్లో పైసా అవినీతి జరగలేదు
– జగన్, పవన్‌లకు మేం చేసిన అభివృద్ధి కనిపించటం లేదు
– కేసుల మాఫీకోసం కేంద్రంతో రాజీ పడ్డారు
– చేతనైతే అభివృద్ధికి సహకరించండి లేకుంటే గమ్ముంగా ఉండండి
– రాష్ట్రానికి దోహ్రం చేస్తే కబడ్దార్
– మన పోరాటం వ్యక్తులపై కాదు.. ప్రభుత్వాలపైన ఉండాలి
– రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
– విజయవాడలో సామూహిక ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
అమరావతి, జులై5(జనం సాక్షి) : ఎన్టీఆర్ గృహాలు ఆడబిడ్డలకు కాను అని, అందరికీ సొంతింటి కల నెరవేర్చడమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో సామూహిక ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇండ్ల గృహప్రవేశాలను ప్రారంభించిన చంద్రబాబు లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం అక్కడే జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తన లక్ష్యమని అన్నారు. ఆ మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. గాంధీజయంతి నాటికి మరో మూడులక్షల ఇండ్లు నిర్మాణాలు చేసి ఇస్తామన్నారు. విజయవాడలో 60వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇండ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నాయని, ఇండ్ల నిర్మాణాల్లో ఒక్కపైసా అవినీతి జరగలేదని చంద్రబాబు స్పష్టంచేశారు. పేదల ఇండ్లస్థలాల కోసమే రూ.500 కోట్లను కేటాయించామని అన్నారు. సొంతింట్లో ఉండే ఆనందమే వేరని అన్నారు. నా జీవితంలో ఇంతకంటే సంతోషకరమైన రోజు లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల నిర్మాణం గురించి చాలా చెప్పారు కానీ… నిర్మించలేదన్న చంద్రబాబు అన్నారు. నిర్మించినవాటిలో రూ. 4,150 కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా… కాంగ్రెస్ నేతలే ఆ నిధులు తినేశారని విమర్శించారు. పేదల పొట్ట కొట్టి పందికొక్కుల్లా మెక్కారని మండిపడ్డారు. నివాసానికి అనువుగా లేని ఇళ్లను నిర్మించారని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు బూత్ బంగ్లాలా మాదిరిగా తయారయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాటికి పూర్తి భిన్నంగా ప్రస్తుత ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక సుమారు 5.80 లక్షల ఇళ్లను నిర్మించి గృహ ప్రవేశ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. కేంద్రం ఇచ్చేది ఏ మూలకూ సరిపోలేదని ఇళ్లను నిర్మించడమే కాదు.. మౌలిక సదుపాయాలూ కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇంటి జాగాలేజాగాలు ఇవ్వడమే కాదు… ఇళ్ల నిర్మాణం చేపడతామని… గ్రావిూణ ప్రాంతాల్లో 13 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 7.5 లక్షల ఇళ్లను నిర్మించాలని సంకల్పించామన్నారు. సుమారు 20 లక్షల ఇళ్లకు రూ. 50 వేల కోట్లు ఖర్చుపెడుతున్నామని… అదనంగా 5 లక్షల ఇళ్లు కట్టించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల పరిధిలోని 664మండలాల్లోని 12,762 గ్రామాల్లో 3లక్షల ఇండ్లలో గురువారం గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అనంతపురంలో 24,608, శ్రీకాకులంలో 19,616, విజయనగరంలో 16,504, కర్నూల్‌లో 24వేల402 ఇళ్లు, విశాఖపట్టణంలో 27,697, తూర్పుగోదావరి జిల్లాలో 37,207, పశ్చిమగోదావరి జిల్లాలో 27,710, గుంటూరులో 24,767, ప్రకాశంలో 19,655, నెల్లూరులో 19,045, చిత్తూరులో 20,888, కడపలో 15,891ఇండ్లలో గృహప్రవేశాలను నిర్మించటం జరిగిందన్నారు. ప్రతిపక్షాలకు ప్రజల ఓట్లు కావాలి.. వారి బాగోగులు అవసరం లేదన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కేవలం నన్ను విమర్శించటం తప్ప పేదల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలిసిరావాలన్న ఆలోచనే లేదని చంద్రబాబు ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏమైనా ఉంటే మనం మనం చూసుకుందాం… కేంద్రంపై కలిసి పోరాటం చేద్దామంటే ప్రతిపక్షాలు వినడం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి అన్ని ఇచ్చేశామని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందని… ఏపీకి అన్నీ ఇచ్చేశామని కేంద్రం తప్పుడు మాటలు చెబుతోందని మండిపడ్డారు. మనం పన్నులు కట్టాలి… కేంద్రం పెత్తనం చేయాలనే ధోరణి బీజేపీలో కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి అండగా ఉంటారని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, కానీ, నిలువునా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు . కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వమంటే ఇవ్వరు, మేమే కట్టుకుంటామన్న కేంద్రం సహకరించడంలేదన్నారు. కేసుల కోసమే వైసీపీ కేంద్రంతో రాజీ పడిందని ఆరోపించిన చంద్రబాబు.. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం… జగన్, పవన్‌కు కన్పించదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తే సహకరించే ప్రసక్తేలేదని స్పష్టం చేసిన చంద్రబాబు… రాష్ట్రానికి అన్యాయం చేసేలా కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినా… జగన్, పవన్‌కి కేంద్రాన్ని విమర్శించడానికే నోటి మాట రావడం లేదన్నారు. ఓట్లు కావాలి… కానీ, రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఉంటే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై చెప్పు విసరడాన్ని చంద్రబాబు ఖండించారు. ఆవేశంతో ఓ వ్యక్తి చెప్పులు విసిరారు… అలాంటివి చేయొద్దని సూచించిన చంద్రబాబు… మన పోరాటం వ్యక్తుల విూద కాదు… వ్యవస్థపై అన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక నేతలు పాల్గొన్నారు.