ఎన్నికల ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించాలి
మండలంలోని పోలింగ్‌స్టేషన్‌లను సందర్శించిన ఎన్నికల పర్యవేక్షణ అధికారి విజయ్‌కుమార్ దార్వే
మండలంలో మొత్తం 65 పోలీంగ్‌స్టేషన్‌లు ఉన్నట్టు వెల్లడి
మొయినాబాద్
జరగనున్న ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పర్యవేక్షణ అధికారి విజయ్‌కుమార్ దార్వే మండల అధికారులకు సూచించారు. ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో నిర్వహించుకోనేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదివారం మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించి ఏర్పాటు చేస్తున్న ఎన్నికల పోలీంగ్ స్టేషన్‌లను పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీంగ్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వసతుల గురించి తహసీల్దార్ చంద్రకళను ఆడిగి తెలుసుకున్నారు. మొయినాబాద్ మండలంలో మొత్తం ఎన్ని పోలీంగ్ స్టేషన్‌లు ఉన్నాయని ఎంత మంది ఓటర్లు ఉన్నారని వారికి ఎలాంటి సదుపాయాలను కలిగిస్తున్నారు పలు విషయాలపై ఆడిగితెలుసుకున్నారు. ఏర్పట్లపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. డిసెంబర్ 7వ తేదిన ఓటు వేయడానికి వచ్చే వృద్దులకు, మహిళాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విషయాలపై ఆయన అధికారులకు పలు సూచనాలు చేశారు. మొయినాబాద్ మండలంలో మొత్తం 65 పోలీంగ్ స్టేషన్‌లు ఉన్నట్టు తెలిపారు. అనుబంద గ్రామాల్లో సైతం పోలీంగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని ఓటర్లకు త్రాగు నీరు, ఇతర సదుపాయాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట మొయినాబాద్ తహసీల్దార్ చంద్రకళ, ఇంచార్జ్ పాండు, సిబ్బంది ఉన్నారు.