ఎన్నికల కోసం రెడీ అవుతోన్న మోడీ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌

తన ఐదేళ్ల పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ సమర్పిస్తానని ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, తొలిసారి పార్లమెంటు లో అడుగుపెట్టినప్పుడు ప్రఢానిగా మోడీ 2014లో ప్రకటించారు. మోడీ పగ్గాలు చేపట్టగానే కొంత భిన్నంగా కనిపించారు. అయితే ఆ భిన్నత్వం సానుకూలత దిశగా కనిపించినా, పాలనలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మోడీ డిఫరెంట్‌ అన్న భావన..ముసుగు తొలగిపోయింది. రెండేళ్ల తరవాత ప్రజలంతా ప్చ్‌.. అంటూ నిట్టూర్పులు మొదలు పెట్టారు. సంస్థాగతంగా ప్రజలు చర్చించుకుని..తమకు మేలు జరిగిందన్న రీతిలో మోడీ పాలన అందించలేకపోయారు. ఓ రకంగా చెప్పాలంటే అన్ని రంగాల్లో వైఫల్యాలు తప్ప మరోటి కానరావడం లేదు. దీనికితోడు బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశం రూపురేఖలు మారిపోతయాన్న భ్రమలు తొలగి పోయాయి. రౌతును బట్టి గుర్రం.. అన్న రీతిలో బిజెపికి ఉన్న ఓ ఇమేజ్‌ మంచులా కరిరిగిపోయింది. ఆయా రాష్ట్రాల్లో అధికారం సంపాదించడం వల్ల బిజెపి ప్రభవిస్తోందని కమల నాథులు కూడా భావించడం లేదు. కేవలం ఓ ఇద్దరు మాత్రమే బిజెపి దేశవ్యాప్తంగా వెలుగుతోందని,గతంలో సాధించని విజయాలు సాధించామని చంకలు గుద్దుకుంటున్నారు. ప్రధానంగా నోట్లరద్దు, జిఎస్టీ కారణంగా సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారాయి. బ్యాంకుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వేలకోట్లు ఎగవేసిన వారు దర్జాగా దేశం విడిచి పోయి ఎంజాయ్‌ చేస్తున్నారు. ధరలు ఆకాశన్నాంటుతున్నాయి. నిరుద్యోగుల జాబితా పెరుగుతోంది. పాలనాపరంగా ప్రభుత్వ వైఫల్యాలకు ఇవి ఓ మచ్చుతునక మాత్రమే. ఈ దశఅలో నాలుగేళ్లు గడిచిన తరవాత దేశ రాజకీయాల్లో ఎన్నికల పరుగు మొదలైంది. అయినా నాలుగేళ్లు పూర్తయిన వేళ మందీమార్బలంతో బిజెపి నేతలు మళ్లీ జమిలి ఎన్నికల పేరుతో ముందస్తు ఎన్నికల వ్యూహాల్లో మునిగారు. ఉమ్మడి ఎన్నికల వల్ల ఖర్చులు కలసి వస్తాయని, భారం తగ్గుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రకటించారు. అంటే ఆయా రాష్ట్రాల ఎన్‌ఇనకలతో పాటు కేంద్రంలో ఎన్నికలకు బిజెపి సిద్దం అవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే తొలిసారిగా మద్దతు ధరలను పెంచారు. మద్దతు ధరల పెంపుపై ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండేలా మద్దతు ధర ఇస్తామంటూ రైతు సోదరులు, సోదరీమణులకు ఇచ్చిన హావిూని ప్రభుత్వం నెరవేర్చినందుకు చాలా సంతోషపడుతున్నా. మద్దతు ధర పెంపుదల చరిత్రాత్మకం. రైతులంద రికీ అభినందనలు. వ్యవసాయ రంగం, రైతుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం కాదని బిజెపి నేతలు చెప్పారు. ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ మళ్లీ బిజెపిని గద్దెను ఎక్కిస్తాయా లేదా అన్నది ప్రజల ఆలోచనా సరళిని బట్టి ఉంటుంది. పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దేశ చరిత్రలో మొదటిసారి బిజెపికి వచ్చింది. దానిని సమర్థంగా నిర్వహించారా లేదా అన్నది ప్రజలు తేలుస్తారు. ఎన్‌డిఎ హయాంలో అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వాన్ని అనేక పార్టీల మద్దతుతో చాలా సమర్థంగా నడిపారు. అయితే మోదీ తనకు వచ్చిన తిరుగులేని అధికారాన్ని ఏకపక్ష నిర్ణయాలు చేయడానికి ఉపయోగించుకున్నారు. ప్రజలకు ఏ రకంగా మేలుచేయని, ప్రజలు తమ డబ్బు కోసం తాము ఇక్కట్లు పడవలసిన దుస్థితిలోకి నెట్టే నిర్ణయాలు చేశారు. ప్రజలకు నేరుగా మేలు కలిగే మౌలికమైన నిర్ణయాలు ఏవీ చేయలేదు. సబ్సిడీ గ్యాస్‌ను కోటిమందికి పైగా ప్రజలు వదులుకుంటే ఆ ధనంతో ఇతర ప్రజలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారు. మోదీ పాలనాకాలమంతా ప్రజల త్యాగమే తప్ప ప్రభుత్వత్యాగం ఎక్కడా కనిపించలేదు. అయినా మోడీ తన నాలుగేండ్ల పాలనను సమర్థించుకోవడం, ప్రత్యర్థుల ప్రతిష్ఠను దెబ్బతీయడం, అంతిమంగా ఎన్నికల్లో ఓడించడం లక్ష్యంగా ఆయన బృందం ముందుకు సాగుతున్నది. అది విజయవంతం అవుతుందా లేదా అన్నది దేశ ప్రజలు మోదీని ఎంతవరకు నమ్ము తారన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. నిజానికి ఆయన తన నాలుగేండ్ల పాలనను సమర్థించుకోవడంలో ఇప్పటికే విఫలమయ్యారు. దేశంలోని అనేక పార్టీలు తొలుత మోడీని సమర్థించినా తరవాత ఆయనను తెగడని వారు లేరు. ఎపిలో చంద్రబాబు అయితే ఇప్పుడు నిత్యం కారాలుమిరియాలు నూరుతున్నారు. అలా చేసినా లాభం లేదన్న చందంగా తనపనేదో తను చేసుకుంటే కెసిఆర్‌ ముందుకు పోతున్నారు. జాతీయ స్థాయి రాజకీయాలలో అనుభవం, పాతపరిచయాలు ఉన్న చంద్రబాబు కర్ణాటక పరిణామాల నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ముఖ్యమంత్రులను ఒకతాటిపైకి తెచ్చారు. అదే సమయంలో స్వరాష్ట్రంలో బీజేపీపై దాడిని ముమ్మరం చేశారు. ఇలా చెప్పకుంటూ పోతే శివసేన కూడా బిజెపికి దూరంగా జరిగి నిత్యం విమర్శలను కుమ్మరిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వం తమకు మేలు చేయకపోగా తమకు నగదు కష్టాలు, పన్ను కష్టాలు విూద మోపిందని ప్రజలు గట్టిగా భావిస్తు న్నారు. ఈ దశలో తన నాలుగేళ్ల వైభవం చూడండని చెబితే ప్రజలు నమ్ముతారా అన్నది ముఖ్యం. ఏ విషయంలో ప్రజలు తామంతా మోడీ వల్ల ఆనందంగా ఉన్నామని చెప్పగలరు. బిజెపికి అధికారం ఇచ్చినా ఏవిూ చేయలేదన్న భావన ఉన్నప్పుడు మోడీ లాంటి నాయకుడిని ఎలా నమ్ముతారు. యోగాను అంతర్జా తీయ దినోత్సవం చేశామని లేదా మరేదో చేశామని చెబితే దాంతో ఒరిగిందేమిటని బాహాటంగా విమర్శి స్తున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. ఈ దశలో ఎన్నికల వదిలిన అశ్వాన్ని బిజెపి తిరిగి అందు కోగలదా అన్నది చూడాలి.