ఎన్ని’కల’ బడ్జెట్‌

బాదుడంతా ధనికులపైనే
వేతన జీవులకు నిరాశే
వ్యక్తిగత పన్ను మినహాయింపు 2.20 లక్షలకు పెంపు
2013-14 సాదరణ బడ్జెట్‌(రూ.16,65,297 కోట్లు
ధరలు పెరిగేవి :
సిగరెట్లు,
800సిసి మోటార్‌ బైకులు
విలాసవంతమైన కార్లు
వాహనాలు ,మార్బుల్స్‌
సెట్‌టాప్‌ బాక్సులు
ఖరీదైన మొబైల్‌ ఫోన్లు
ధరలు తగ్గేవి :
చేనేత వస్తువులు
తోలు వస్తువులు
పాదరక్షలు
తివాచీలు
జూట్‌ , కార్పెట్లు
రెడీమేడ్‌, బ్రాండెడ్‌దుస్తులు
ఆదాయపు పన్ను
వ్యక్తిగత వార్షికాదాయ పరిమితి : రూ. 2.20 లక్షలు
పన్ను స్లాబ్‌ : పాత విధానమే
రూ. 5 లక్షల లోపు ఆదాయం : 10 శాతం పన్ను
(రూ.2వేల రాయితీ)
రూ. 10 లక్షల పైన ఆదాయం : 30 శాతం పన్ను
కోటిపైన ఆదాయం : 30 శాతం పన్నుతో పాటు
10 శాతం సర్‌చార్జ్‌
వెయ్యికోట్లతో మహిళా బ్యాంక్‌
నిర్భయ నిధి

ఆర్థిక మంత్రి చిదంబరం మహిళలపై వరాలు కురిపించారు. మహిళల భద్రత, రక్షణ, ఆర్థిక స్వావలంబన కొరకు భారీగా నిధులు కేటాయించారు. ప్రత్యేక నిధితో పాటు ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రూ.వెయ్యి కోట్లతో ‘నిర్భయ’ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతేడాది ఢిల్లీలో సామూహిక హత్యాచారానికి గురైన ‘నిర్భయ’ పేరుతో ఈ నిధిని ఏర్పాటు చేయడం గమనార్హం. మహిళల రక్షణ మనందరి బాధ్యత అని, అందుకే, వారి రక్షణ కోసం ప్రత్యేక నిధిని మినహాయించారు. లెదర్‌, చెప్పుల దిగుమతి సుంకం తగ్గించారు. దీంతో చెప్పులు, లెదర్‌ బ్యాగ్‌లు, రెడీమేడ్‌ దుస్తుల ధరలు తగ్గనున్నాయి. నేషనల్‌ చిల్డన్స్ర్‌ ఫండ్‌కు విరాళాలు ఇచ్చే వాటిపై 100 శాతం మినహాయింపునిచ్చారు.
వీటికి మినహాయింపు..
ఎలక్టాన్రిక్స్‌ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించిన చిదంబరం.. సేవా పన్నుల విభాగంలో మాత్రం కాస్త కరుణ చూపారు. సేవా పన్ను నుంచి 17 సేవలకు మినహాయింపునిచ్చారు. విద్య, ప్రభుత్వ సేవలు, వినోదం, ప్రజారవాణ తదితర సేవలకు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. సినీ రంగానికి సేవాపన్ను నుంచి మినహాయింపు కల్పించారు. వ్యవసాయేతర వస్తువుల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకంలో ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే, కార్పొరేట్‌ పన్నులనూ యథాతథంగా కొనసాగించారు. బ్రాండెడ్‌ వెండి ఆభరణాలపై దిగుమతి సుంకం మినహాయింపునిచ్చారు.
వీటి ధరలు పెరుగుతాయి..
లగ్జరీ కార్లు, టూవీలర్‌ వాహనాలు
మొబైల్‌ ఫోన్లు
సెట్‌టాప్‌అప్‌ బాక్స్‌లు
సిగరెట్లు
సిమెంట్‌, మార్బుల్స్‌
రెస్టారెంట్‌ భోజనాలు
ఇవి తగ్గుతాయి..
వినోదం
బ్రాండెడ్‌, రెడీమేడ్‌ దుస్తులు
కార్పెట్లు, జూట్‌ బ్యాగ్‌లు
లెదర్‌ ఫుట్‌వేర్‌
అంకెల గారడీ
అంకెల గారడీ చేసిన ఆర్థిక మాత్యులు నొప్పి తెలియకుండానే గట్టిగా మొత్తారు. అన్ని వర్గాలపైనా చిదంబరం భారం విధించారు. పేద, మధ్య, ఎగువ మధ్య, ఉన్నత వర్గాలపై పన్నుల వీరబాదుడు బాదారు. బడ్జెట్‌లో దాదాపు రూ.18 వేల కోట్ల మేర బాదేశారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.13,300 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ.4,700 కోట్ల భారం మోపారు. వడ్డించడంలో ఏ వర్గాన్నీ వదలని ఆర్థిక మాత్యులు.. మొబైల్‌, సెట్‌టాప్‌అప్‌ బాక్స్‌ల దిగుమతిపై సుంకం పెంచేశారు. ప్రధానంగా ఎలక్టాన్రిక్‌ వస్తువులు సహా వివిధ వస్తువులపై దిగుమతి సుంకం పెంచారు. కస్టమ్స్‌, ఎక్సైజ్‌ సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని చెబుతూనే.. తెలియకుండా పన్నుల మోత మోగించారు. చిదంబరం తాజా నిర్ణయంతో సామాన్యుడి చేతిలో ఇమిడిపోయిన మొబైళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రూ.2 వేల లోపు ఖరీదైన మొబైళ్లపై పన్నుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, రూ.2 వేల పైనా ఖరీదు చేసే సెల్‌ఫోన్లపై 6 శాతం పన్ను పెంచారు. సెట్‌టాప్‌అప్‌ బాక్సుల దిగుమతిపై సుంకం 5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. అలాగే 800 సీసీ దాటిన వాహనాలపైనా పన్ను పెంచారు. 60 శాతం నుంచి 75 శాతానికి దిగుమతి సుంకాన్ని పెంచారు. విలాసవంతమైన వాహనాలపై 75 శాతం మేర ఉన్న సుంకాన్ని 100 శాతానికి, ఎస్‌యూవీ వాహనాలపై సుంకం 27 శాతం నుంచి 30 శాతానికి పెంచేశారు. అలాగే, సిగరెట్‌ ప్రియులను గట్టిగా వాత పెట్టారు. పొగాకు ఉత్పత్తులపై 18 శాతం ఎక్సైజ్‌ పన్ను విధించారు. ఏసీలతో కూడిన రెస్టారెంట్‌లో భోజనాలకు భారీగా వడ్డంపులు చేశారు. దీంతో రెస్టారెంట్లలో భోజనాలు మరింత ప్రియం కానున్నాయి. అయితే, సినిమా ప్రియులపై చిదంబరం కాస్త జాలి చూపారు. సినిమా రంగానికి వినోదపు పన్ను మినహాయింపునిచ్చారు. అలాగే, చేనేత, నూలు, దుస్తులు ఎక్సైజ్‌ డ్యూటీ పూర్తిగాచీళిటాయిస్తున్నట్లు చిదంబరం తెలిపారు. ఎన్నో రకాల కలలతో స్త్రీ సమాజంలోకి అడుగు పెడుతుందని, వారి భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అందుకే నిర్భయ ఫండ్‌ నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. దీన్ని ఖర్చు పెట్టడానికి సరైన ప్రణాళిక రచించవలసిందిగా సంబంధిత విభాగాలకు సూచించారు. అలాగే, ప్రత్యేక మహిళా బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌ నాటికి మహిళా బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం రూ. వెయ్యి కోట్ల మూలధనంతో ప్రభుత్వ రంగ మహిళా బ్యాంకును స్థాపిస్తామని చెప్పారు. ప్రతి బ్యాంకుకు ఏటీఎం తప్పనిసరి అని పేర్కొన్నారు.