ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తా.

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు యం రమేష్ మహరాజ్.
తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి) రాబోయే ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తానని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు యం రమేష్ మహారాజ్ మరోసారి స్పష్టం చేశారు. శనివారం తాండూరు పట్టణం సిండికేట్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ పదవి రాజీనామాపై మరియు టీపీసీసీ డెలిగేట్ ధారాసింగ్ పార్టీ రాజీనామా పై క్లారిటీతో కాంగ్రెస్ శ్రేణులకు భరోసా కల్పించారు.కాంగ్రెస్ పార్టీలో నాయకులకు మరియు కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎంత దూరానికైనా సిద్ధమని తెలిపారు. సీనియర్ నాయకులు పెద్దేముల్ జడ్పీటీసీ ధారా సింగ్ మరియు నాకు కనీస సమాచారం లేకుండా టీపీసీసీ డెలిగేట్ పదవి నుండి తొలగించడం సమంజసం కాదన్నారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావొద్దు అనే ఉద్దేశం తో పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం జరిగిందని వివరించారు.
అధిష్టానంతో మాట్లాడి జడ్పిటిసి ధారా సింగ్ కు తప్పకుండా న్యాయం చేస్తామని ఏఐసీసీ ఇంచార్జ్ బోసు రాజు మాట ఇచ్చారని తెలిపారు. రాబోయే ఎన్నికల బరిలో తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్,
చంద్రశేఖర్ గౌడ్ తోపాటు తదితరులు ఉన్నారు.