ఎన్నికల సిబ్బంది ఈవీఎంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
తుంగతుర్తి అక్టోబర్ 28 (జనం సాక్షి)
ఈవీఎం యంత్రాల పనితీరుపై పిఓలు . ఏపీవోలు. సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల బాలుర పాఠశాలలో 500 మంది ప్రొసీడింగ్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఆఫీసర్లకు ఈవీఎం పనితీరుపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన ఉద్యోగులు ఎన్నికలలో పకడ్బందీగా పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పై ప్రొసీడింగ్ ఆఫీసర్లు అవగాహన కలిగి ఉండటంతో పాటు పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు .ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముందస్తుగా ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలని ఆదేశించారు. మాకు పోల్ నిర్వహణ ఈవీఎం యంత్రాలు. బ్యాలెట్ కంట్రోల్ రూమ్ .వివి ప్యాట్ల కనెక్షన్లు. మరమ్మతులకు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి యాదగిరి రెడ్డ. డిటి హరిచంద్ర ప్రసాద్ తోపాటు వివిధ మండలాల తాసిల్దార్లు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.