ఎన్‌సీసీ వల్లే నాకు క్రమశిక్షణ అలవడింది: ప్రధాని నరేంద్ర మోడీ

4

న్యూఢిల్లీ,జనవరి28 : బాల్యంలో ఎన్‌సిసి లో చేరడం వల్లే తనకు క్రమశిక్షన అలవడిందని  భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీనివలల్‌  క్రమశిక్షణ అలవడిందన్నారు. జీవితంలో ఇది బాగా పనికి వచ్చిందన్నారు. న్యూఢిల్లీలోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్సీసీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన మంత్రివర్గ సహచరులు మనోహర్‌ పారికర్‌, సుష్మాస్వరాజ్‌ తదితరులు ఎన్‌సిసి శిక్షణ పొందిన వారేనని అన్నారు. భారత్‌ భిన్నత్వంలో ఏకత్వానికి ఇదే నిదర్శనమన్నారు. మన దేశం ఎన్నో భిన్నత్వాలను సంతరించుకుని ఉందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం మన జాతికి ఎంతో అందాన్ని సంతరించి పెడుతోందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన జాతికి ఎంతో బలమని పేర్కొన్నారు. ఎన్సీసీ ర్యాలీలో బాలికలు ఎక్కువ సంఖ్యలో కనిపించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తానొక మిని ఇండియాను చూస్తున్నట్టు భావిస్తున్నానని తెలిపారు. 26న జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ను స్త్రీశక్తికి అంకితమిచ్చానని ప్రధాని తెలిపారు. రక్షణ మంత్రి పారికర్‌, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, ఢిల్లీ రాష్ట్ర బీజేపీ అభ్యర్థి కిరణ్‌బేడీ, జయాబచ్చన్‌ అందరూ ఎన్సీసీ నుంచి వచ్చిన వారేనని వెల్లడించారు. ఇంకా చాలా మంది బాలికలు ఎన్సీసీలో చేరాలని

కోరారు. అనంతరం తన పూర్వ జ్ఞాపకాల్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. ర్యాలీలో పాల్గొన్నంత సేపూ ఎన్సీసీతో తనకున్న అనుబంధం గుర్తొచ్చిందంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ఇదిలావుంటే ఒలింపిక్‌ పతక విజేత మేరీ కోమ్‌ నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన బాక్సింగ్‌ అకాడవిూని ఆయన చేతుల విూదుగా ప్రారంభించాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆహ్వానాన్ని ఆయనకు అందించారు. మేరీ సొంత రాష్ట్రం మణిపూర్‌లో అకాడవిూని ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు.