ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో

రాజీవ్ ట్రోఫీ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం…

యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):–
భువనగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాల మైదానంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రోఫీ -2023 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి.మొదటి మ్యాచ్ లో టైమ్స్ జూనియర్ కళాశాల మరియు కృషి ఐ టి ఐ జట్లు తలపడ్డాయి. ముందుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు మంగ ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్రె నరేష్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్ ,యువజన కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గం అధ్యక్షులు ఎండి అవేస్ చిస్తి లు ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు అందజేసి టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు
మంగ ప్రవీణ్ మాట్లాడుతూ భారత జాతీయ విద్యార్థి సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం కోసం వారిలో జాతీయ భావం పెంపొందించడం కోసం జిల్లా స్థాయి ఇంటర్మీడియట్ లెవెల్ కళాశాలల క్రికెట్ పోటీలు రాజీవ్ ట్రోఫీ 2023 పేరుతో నిర్వహిస్తున్నామని ఈ పోటీలలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయని ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, అన్ని జట్లకు పార్టిసిపేషన్ బహుమతులు, ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన జట్లకు బహుమతులు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ తదితర బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోళ్ళ గంగాధర్,జిల్లా ఎన్ ఎస్ యు ఐ కార్యదర్శులు పాండాల శరత్ గౌడ్, పల్సం మహేష్, రేగు రమేష్, ఎండి మసూద్, భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు బొల్లెపల్లి వినయ్,ఎండీ షరీఫ్,మనోహర్,నాయకులు ఏడుమేకల మహేష్ యాదవ్,కొల్లూరి రాజు, జంగిటి వినోద్ వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.