ఎపిలో కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదు


ప్రకాశంలో విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్‌
అమరావతి,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,535 మంది కోలుకున్నారు. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసులు 20,01,255కు పెరిగాయి. ఇవాళ్టివరకు 19,72,399 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 15,141 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,715కు చేరాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,678 మంది కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇదిలావుంటే ఒంగోలు డీఆర్‌ఎం మున్సిపల్‌ హైస్కూల్‌లో కరోనా కలకలం రేగింది. హెడ్‌మాస్టర్‌ సహా ముగ్గురు టీచర్స్‌, ముగ్గురు స్టూడెంట్స్‌కు కరోనా సోకింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోన లక్షణాలతో కనిపించడంతో తోటి ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనల నడుమ ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించారు. ముందుగా తరగతి గదులను శానిటైజ్‌ చేయించారు. విద్యార్థులకు థర్మల్‌ పరీక్షలు నిర్వహించి.. తరగతి గదుల్లోకి అనుమతించారు.