ఎమ్మెల్యే రాజయ్య పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
-చిలుక ప్రవీణ్ చిత్ర పటంపై చెప్పులతో దాడి
లింగాల ఘణపురం, జులై26(జనంసాక్షి):
మండల కేంద్రంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ యూ ఛానల్ చిలుక ప్రవీణ్ చిత్ర పటం పై టిఆర్ఎస్ మండల నాయకులు చెప్పులతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిధిగా జడ్పిటిసీ గుడి వంశీధర్ రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి లు హాజరై మాట్లాడుతూ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే రాజయ్య చిల్పూర్ దేవాలయంలో మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్ళి పూజలు చేస్తే, ఆ సంఘటన ఫై యూట్యూబ్ ఛానల్ చిలుక ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని అన్నారు. వేంటనే వీడియోను తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కార్యాలయాన్ని ధ్వంసం చేస్తామని అన్నారు. అంతకు ముందు స్థానిక పోలీస్ స్టేషన్ చిలుక ప్రవీణ్ ఫై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉడుగుల భాగ్యమ్మ, నాగేందర్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు దుసరి గణపతి, టీఆర్ఎస్ మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area