ఎమ్మెల్సీకి పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా

` సస్పెండ్‌ చేయడంతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
` రెండు దశాబ్దాలు పార్టీ కోసం కష్టపడ్డా
` ఇదా నాకు దక్కిన గౌరవమని ఆవేదన
` హరీశ్‌ వెనక సీఎం రేవంత్‌ ఉన్నాడు
` బిఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకునే కుట్రలు
` రేపు కేటీఆర్‌కు కూడా ఇలాంటి గతే పడుతుంది
` నన్ను బయటకు పంపేందుకు ఎప్పటినుంచో ప్లాన్‌లు
` కేసీర్‌ ఇది గుర్తించి ముందుకు సాగాలి
` గుంటనక్కలు హరీశ్‌, సంతోష్‌ల పట్ల జాగ్రత్త!
` హరీశ్‌ రావు బబుల్‌ షూటర్‌
` సమస్యను సృష్టించి సాల్వ్‌ చేసానని చెప్తాడు
` రేవంత్‌తో కుమ్మక్కయ్యాడు
` మీడియా సమావేశంలో కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌(జనంసాక్షి):తను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన కారణంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్‌ తనపై సస్పెన్షన్‌ వేటు- వేయడంతో.. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు- ఆమె వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు- చేసిన విలేకర్ల సమావేశంలో కవిత మాట్లాడారు. తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు తాను ఈ పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఏదో జరిగిపోయినట్లు- దుష్టచతుష్టయం ఏదో ప్రచారం చేస్తుందంటూ కవిత మండిపడ్డారు. తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్లుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ వద్దకు వెళ్లితే.. తనను గన్‌మెన్లు అడ్డుకున్నట్లు రాయించారన్నారు. ఆరడుగుల బుల్లెట్‌ ఈ రోజు తనను గాయపరిచిందన్నారు. సంతోష్‌ రావు.. చేసిన పనులతో కేటీఆర్‌కు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్‌, సంతోష్‌ మూఠాలు.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కుమ్మక్కయ్యాయన్నారు. హరీష్‌ రావును పక్కన పెట్టుకుని.. నిజాలు మాట్లాడిన తనను బయటకు పంపాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు దశాబ్దాలు పార్టీ కోసం కష్టపడ్డా
రెండు దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే.. చివరకు తనకు సస్పెన్షన్‌ దక్కిందంటూ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత విలేకర్లతో మాట్లాడుతూ.. వివరణ కూడా కోరకుండా తనపై సస్పెన్షన్‌ వేటు- వేశారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న సమయంలో తాను పార్టీ కోసం, తెలంగాణ కోసం మాత్రమే కష్టపడ్డానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. బిడ్డను చంకన వేసుకుని వచ్చి తెలంగాణ కోసం కష్టపడడ్డానని అన్నారు. అమ్మకు కూడా దూరంగా ఉండాల్సి రావడం బాధగా ఉందన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరనన్నారు. తనకు ఏ పార్టీతో పనిలేదని కుండ బద్దలు కొట్టారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని తాను అనలేదన్నారు. కేసీఆర్‌కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని పేర్కొన్నారు. సోషల్‌ విూడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన శరీరం బీఆర్‌ఎస్‌ అయితే.. తన ఆత్మ జాగృతి అని అభివర్ణించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తాను పని చేశానన్నారు. బీఆర్‌ఎస్‌లో తన భాగస్వామ్యం ఏం లేదా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు భాగస్వామ్యం మాత్రమే ఉందా? అని అడిగారు. తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్టుగా ప్రచారం చేశాయని మండిపడ్డారు. కేసీఆర్‌ దగ్గరకు వెళ్తే గన్‌మెన్లు తనను అడ్డుకున్నట్టు రాయించారన్నారు. లేఖ లీక్‌ చేసిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ బీఆర్‌ఎస్‌ అగ్రనేతలను ఆమె ప్రశ్నించారు. పార్టీ తనపై సస్పెన్షన్‌ వేటు- వేయడంతో.. తన పుట్టింటికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తనకు అమ్మ అంటే చాలా ఇష్టమన్నారు. ఆమెను కలవ లేక పోతున్నట్లు కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకునే కుట్రలు
బిఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్కల్లా చుట్టూ చేరిన హరీష్‌ రావు, సంతోష్‌ రావులతో జాగ్రత్త అంటూ కెసిఆర్‌ తనయ కవిత హెచ్చరించారు. అధికారంలో ఉండగా అడ్డగోలుగా సంపాదించుకున్న వీరు ఇప్పుడు విూకు కూడా ఎసరు పెట్టే పనిలో ఉన్నారు..తస్మాత్‌ జాగ్రత్త అని అన్నారు. అన్నా రామన్నా నీవు కూడా వరితో జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేశారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపడానికి కారణమైన వీరు మన కుటుంబం విచ్ఛిన్నం కావాలని పన్నాగం పన్నారని అన్నారు. బిఆర్‌ఎస్‌లోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్పచ్రారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో కవిత విూడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాట్లాడుతూ.. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా కవిత ప్రకటించారు. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు మేం ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబం బాగుండొద్దు.. మేం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం వస్తుంది. నేను, నాన్న, అన్న కలిసి ఉండటం చాలా మందికి ఇష్టం లేదు. దీనిలో భాగంగా మొదటిగా నన్ను బయటకు పంపించారు. అదిక్కడితో ఆగదు. నాన్నా.. విూ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి. రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న (కేటీ-ఆర్‌)కు, విూకూ పొంచి ఉంది. భారత రాష్ట్ర సమితిని హస్తగతం చేసుకునే కుట్రలోనే నన్ను బయటకు పంపించారని కవిత వ్యాఖ్యానించారు. అక్రమ కేసులు పెట్టి తిహార్‌ జైలులో ఐదున్నర నెలలు ఉండి వచ్చాక గతేడాది నవంబర్‌ 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత తెలిపారు. గురుకులాలు, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం అందించాలని పోస్ట్‌ కార్డు ఉద్యమం చేశామన్నారు. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చినపుడు గళమెత్తినట్లు- చెప్పారు. బనకచర్ల, భద్రాచలం సవిూపంలోని ముంపు గ్రామాల అంశాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించినట్లు- కవిత తెలిపారు. సీఎం సొంత జిల్లాలో భూనిర్వాసితులకు అండగా ఉన్నామని చెప్పారు. 47 నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలను కలుపుకొని.. గులాబీ కండువాలతో అనేక ప్రజాసమస్యలపై మాట్లాడామన్నారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై భారత రాష్ట్ర సమితి పెద్దలు పునరాలోచన చేయాలన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీసీల అంశంపై మాట్లాడుతుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు- చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెప్పాను. దానిలో తప్పేముంది? నా తండ్రి కేసీఆర్‌ చిటికెన వేలు పట్టుకుని ఓనమాలు నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్‌. చెప్పింది చెప్పినట్లు- ఆయన చేశారు. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అది సామాజిక తెలంగాణ కాదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? సామాజిక తెలంగాణ భారత రాష్ట్ర సమితికి అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ అంటే హరీశ్‌రావు, సంతోష్‌ ఇళ్లల్లో బంగారం ఉంటే అవుతుందా?సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుందని అంటూ అనేక విషయాలన విూడియాముందుంచారు. తనపై ఎలా కుట్రలు సాగించారో సోదాహరణంగా వివరించారు. నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్‌విూట్‌ పెట్టి చెప్పా. విూరు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్‌ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌విూట్‌ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. నాకైతే అనుమానమే. హరీశ్‌రావు, సంతోష్‌ గురించి ఆలోచించాలని కేసీఆర్‌కు బిడ్డగా చెబుతున్నా. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ హరీశ్‌రావు లేరు. పార్టీ పెట్టిన 10 నెలల తర్వాత వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు ఎప్పుడో లొంగిపోయారు. ఆయన్ను గమనించుకో రామన్న అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారా? లేదా? చెప్పాలి. సంతోష్‌, హరీశ్‌రావు గ్యాంగ్‌లు భారత రాష్ట్ర సమితికి పట్టిన జలగలని కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతికి హరీష్‌ రావే కారణమన్నారు. తుమ్మడిహట్టి నుంచి మార్చిందే హరీష్‌ రావని అన్నారు. హరీష్‌ రావు విూద ఆరోపణలు వచ్చిన పాల సరఫరా, ఫామ్‌ హౌజ్‌ గురించి మరుసటి రోజే మాయం అయ్యాయని అన్నారు. ఆనో ట్రబుల్‌ షూటర్‌ కాదు…ట్రబుల్‌ క్రియేటర్‌ అని ఘాటు విమర్శలు చేశారు. మెగా కాంట్రాక్టర్‌తో పోచంపల్లి మోకిల్లాలో 750 కోట్ల విల్లా ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. ఇవన్‌ఈన గుర్తించి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ఈ ఇద్దరిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పార్టీకి కూడా ఇదో హెచ్చరిక అన్నారు.
హరీష్‌ రావు బబుల్‌ షూటర్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె విూడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రెస్‌ విూట్‌లో సంచలన కామెంట్లు- చేశారు. హరీష్‌ రావు, సంతోష్‌ రావులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. హరీష్‌రావు ట్రబుల్‌ షూటర్‌ కాదని, బబుల్‌ షూటర్‌ అని వ్యంగ్యాస్త్రాల్రు సంధించారు. తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వనని స్పష్టం చేశారు. కవిత వేరే పార్టీలో చేరుతుందంటూ జరుగుతుందన్న ప్రచారంపై కూడా ఆమె క్లారిటీ- ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరనని, తనకు ఏ పార్టీతో పనిలేదని స్పష్టం చేశారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడాకే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. తన 20 ఏళ్ల జీవితాన్ని బీఆర్‌ఎస్‌, తెలంగాణ కోసం పనిచేయడానికి వెచ్చించానని, సస్పెన్షన్‌పై మరోసారి ఆలోచించాలని కవిత కోరారు. అయినా తనకు ప్రజలున్నారని, వాళ్ల దగ్గరికే వెళ్తానని చెప్పారు.సోషల్‌ విూడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీ-ఆర్‌ను ఓడిరచేందుకు ప్రత్యర్థులకు హరీష్‌రావు డబ్బు పంపారన్నారు. పోచంపల్లికి మోకిలాలో వందల కోట్ల ప్రాజెక్ట్‌ వచ్చిందని, హరీష్‌రావు ,సంతోష్‌ బీఆర్‌ఎస్‌ను జలగల్లాగా పట్టిపీడిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీతో ఇద్దరూ అంటకాగుతున్నారన్నారు. సంతోష్‌రావు బాధితులు చాలా మంది తనకు ఫోన్‌ చేస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తనపై సస్పెన్షన్‌ వేటు- వేయడంపై కల్వకుంట్ల కవిత బుధవారం విూడియా ఎదుట స్పందించారు. కలికాలం, కర్మ సిద్ధాంతమంటూ ఆమె ఈ సందర్భంగా వేదాంతంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో తాను దాదాపు 20 ఏళ్ల పాటు- సేవా చేశానని ఈ సందర్భంగా కవిత గుర్తు చేసుకున్నారు. అయితే తనపై పుకార్లు చేసిన వారు.. చేయించిన వారు అంతకుఅంత అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు. తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానని స్పష్టం చేశారు. ఏదీ ఏమైనా తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు మాత్రం అన్యాయం జరగనివ్వనని ఆమె కుండ బద్దలు కొట్టారు. తనపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా? అంటూ బీఆర్‌ఎస్‌ అగ్రనేతలను కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అడిగారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కేసీఆర్‌కు తాను కుమార్తెగా జన్మించానని చెప్పారు. అలాంటి కేసీఆర్‌ను, ఆయన పార్టీని తాను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ఆమె పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌పై ఒత్తిడి పెంచి తద్వారా తనను సస్పెండ్‌ చేయించారంటూ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్‌ విూట్‌లో హరీశ్‌ రావు, సంతోష్‌ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్‌ఎస్‌ పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. మొత్తం వాళ్లే చేశారు నాన్నా.. అంటూ కవిత వారిరువురి విూదా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హరీష్‌రావు టార్గెట్‌గా ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు.