ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన భన్వర్‌లాల్
హైదరాబాద్,ఫిబ్రవరి11(జనంసాక్షి): ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్టాల్ల్రో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలకు, తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల మండలి ఎన్నికలకు షెడ్యూల్ బుధవారం వెలువడింది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు షెడ్యూల్ వచ్చింది. మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఒక నియోజకవర్గం కాగా, వరంగల్, నల్గొండ, ఖమ్మం మరో నియోజకవర్గం మరోటి. ఫిబ్రవరి 19న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 26 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 2. మార్చి 16న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 19న ఓట్ల లెక్కింపు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన పట్టభద్రుల ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది.