ఎర్రబెల్లిని బారీ మెజారీటీతో గెలిపించాలి

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా,,,

పాలకుర్తిని అభివృద్దిలో ఆగ్రభాగాన నిలుపుతా..

-మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి సమక్షంలో భారీగా చేరికలు,,

-పాలకుర్తిలో ప్రచారం నిర్వహించిన డీబీఆర్‌పీఎస్‌ నాయకులు

పాలకుర్తి, నవంబర్‌ 25 (జనంసాక్షి ) సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలోని తాను చేసిన అభివృద్ది పనులకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పాలకుర్తి టీఆర్‌ఎస్‌ ఆభ్యర్థి తాజా మాజీ ఎమ్మేల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆన్నారు, ఆదివారం మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, రాయపర్తి, కొడకండ్ల, తోర్రూర్‌ మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు నాయకులు సుమారు 300 మంది తాజా మాజీ ఎమ్మేల్యే ఎర్రబెల్లికి కారు గుర్తుకు ఓటు వేస్తామంటూ కాంగ్రేస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు, దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన శ్రీమంతోజు రామబ్రహ్మం, సోమయ్య, రవి, ఉప్పలయ్య, సత్యనారాయణ, సోమనాథం లతో పాటు 15 మంది కార్యకర్తలు కాంగ్రేస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు, కొడకండ్ల మండలం నేలిబండ తండా, పస్రాతండాలకు చెందిన గుగులోతు జోగ్యానాయక్‌, రాంకిషన్‌, సీతారం, శంకర్‌ లతో పాటు సుమారు 40 మంది కార్యకర్తలు నాయకులు రాష్ట్ర జీసీసీ చైర్మెన్‌ దరావత్‌ గాందీనాయక్‌ ఆద్వర్యంలో కాంగ్రేస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు, పాలకుర్తి మండలం గూడురు గ్రామానికి చెందిన చిక్కుడు సోమరాజు లతో పాటు 10 కార్యకర్తలు కాంగ్రేస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు, మండలంలోని తిర్మలగిరి గ్రామానికి చెందిన ఈర్లరవి మల్లయ్య, కృష్ణ. లతో పాటు 40మంది కార్యకర్తలు ముదిరాజు సంఘం మండలాధ్యక్షుడు చిక్కుడు రాములు ఈర్ల రాజుల ఆద్వర్యంలో కాంగ్రేస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు, తోర్రూర్‌ మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన గ్రాడ్యుయేట్స్‌ యూత్‌ ఆసోసియేషన్‌ సభ్యులు సుమారు 50 మంది ఎర్రబెల్లికి మద్దతు తెలిపారు, దేవరుప్పుల మండలం దేవుడిగుట్టా తండాకు చెందిన దరావత్‌ శ్రీనివాస్‌, మల్లేష్‌, దేవేంందర్‌లతో పాటు 20 యూత్‌ సభ్యులు ఎర్రబెల్లికి కారుగుర్తుకు మద్దతు తెలుపుతూ కాంగ్రేస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు, పాలకుర్తి మండలకేంద్రానికి చెందిన మున్నురుకాపు సంఘం మండలాద్యక్షుడు కొండపెల్లి కుమారస్వామి కాంగ్రేస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు, మండలకేంద్రానికి చెందిన కుమ్మరి సంఘం ఏనుగుతల బిక్షపతి, సమ్మన్న, రేణుక, శ్రీలత, వెంకన్న లతో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు ఎర్రబెల్లికి మద్దతు తెలుపుతూ కాంగ్రేస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు, ఈసందర్బంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తనను నమ్ముకొని పార్టీలో చేరిన కార్యకర్తలందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు, నియోజకవర్గాన్ని ఆన్నిరంగాల్లో ఆభివృద్ది చేసి రాష్ట్రంలోనే ఆగ్రభాగాన నిలుపుతానన్నారు, పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు, ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాద్యక్షుడు నల్ల నాగిరెడ్డి, రైతు సమన్వయసమితి మండల కో-ఆర్డినేటర్‌ వీరమనేని యాకంతరావు, పూస్కురి శ్రీనివాస్‌రావు, పసునూరి నవీన్‌, కమ్మగాని నాగన్న , సలేంద్ర శ్రీనివాస్‌, తదితరులున్నారు