ఎలాంటి విజన్‌లేకుండా  

ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది
– సుదర ప్రదేశాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి
– వెనుకబాటుతనం వల్ల ఉద్యమాలొస్తాయంటుంటే.. రెచ్చగొట్టే ధోరణి అంటున్నారు
– విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ నుంచి విడుదలయ్యే కాలుష్యాన్ని అరికట్టాలి
– జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
– విమ్స్‌, ఐటీ పార్క్‌ను పరిశీలించిన పవన్‌
– బైక్‌పై రుషికొండపై సరదాగా తిరిగిన జనసేనాని
విశాఖపట్టణం, జూన్‌29(జనం సాక్షి) : ఎలాంటి విజన్‌ లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఉదయం విశాఖలోని విమ్స్‌ ఆసుపత్రిని పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సేవల గురించి విమ్స్‌ డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మధురవాడ ఐటి పార్క్‌లోని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థ కార్యాలయాన్ని జనసేనాని సందర్శించారు. కాసేపు బైక్‌పై రుషికొండపై సరదాగా తిరుగుతూ… తన ఫోన్‌లో ప్రకృతి అందాలను పవన్‌ క్లిక్‌ మనిపించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. విశాఖ నగరం ఋషికొండ ప్రాంతం నుండి చూస్తే సౌత్‌ అఫ్రికా కేప్‌ టౌన్‌ను తలపిస్తోందన్నారు. ప్రభుత్వం ఎటువంటి విజన్‌ లేకుండా ఏక పక్షంగా వ్యవహరించటంతో 50 ఏళ్ల తర్వాత ఇటువంటి సుందర ప్రదేశం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఐటీ సెక్టార్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవని పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వెనుక బాటుతనం వలన ఉద్యమాలు వస్తాయని హెచ్చరిస్తుంటే.. అది రెచ్చగొట్టే ధోరణి అనడం సరైంది కాదన్నారు. యూఎస్‌లో కూడా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకి 5 ఏకరాలు ఉంటే… ఇక్కడ 25 ఏకరాలు ఎందుకు కేటాయించారో ప్రభుత్వం మే చెప్పాలన్నారు. ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు అని చెప్పిందని గుర్తు చేసిన పవన్‌… కానీ, ప్రస్తుత పరిస్థితిలో రెండు, మూడు వేల ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ప్రత్యేక ¬దా తీసుకురాలేని ఈ ప్రభుత్వం… కనీసం విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ నుండి విడుదలవుతోన్న కాలుష్యనైనా అరకట్టే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌ కోరారు.