ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో దారుణం…
హైదరాబాద్:ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో దారుణం జరిగింది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన అమృతా రెడ్డి అనే గర్భిణికి ట్రైనీ నర్సులచే వైద్యులు ఆపరేషన్ చేయించారు. అయితే తల్లీబిడ్డ కాసేపు కదలలేదు.. మెదలలేదు. ఇక తల్లీబిడ్డ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మార్చిరీకి వచ్చిన బంధువులకు కాళ్లు, చేతులు ఆడిస్తూ కనిపించింది. దీంతో బంధువులు ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలకు తెలియజేయండంతో డాక్టర్లు వచ్చి వైద్యం చేస్తున్నారు. ఈ ఘటనలపై బాధితురాలి బంధువులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.