Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > నిజామాబాద్ > Main > ఎల్లారెడ్డి లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం / Posted on June 2, 2022
ఎల్లారెడ్డి లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
ఎల్లారెడ్డి: 02 జూన్ (జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జాజుల సురేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఆర్ డి ఓ కార్యాలయంలో ఆర్డిఓ శ్రీను, మున్సిపాలిటీ కార్యాలయం లో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ కార్యాలయంలో సెక్రెట్టి దూమ్డా నాయక్, సివిల్ కోర్టులో జడ్జి…., తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మునీరొద్దీన్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కర్రె మాధవి, జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అలాగే పలు ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్విట్లు పళ్ళు పంచిపెట్టారు