ఎల్‌ఐసి ఉద్యోగి అనుమానాస్పద మృతి

ఆదిలాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎల్‌ఐసీ ఉద్యోగి గోవర్ధన్‌ ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండగా గుర్తించారు. అతని ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడిని ఎవరైనా చంపారా అన్నది ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కాలనీలో కలకలం రేగింది.

—–

తాజావార్తలు