ఎల్ ఎం డి 4 గేట్లు ఎత్తివేత

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :

లోయర్ మానేరు డ్యామ్ 4గేట్లు తెరచి నీరు విడుదల చేసినందున ఎల్ఎండి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
లోయర్ మానేర్ డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నందున శనివారం జిల్లా కలెక్టర్ 4 స్పిల్ వే గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ ఎం డి నీటి సామర్థ్యం 24 టీఎంసీల అని ప్రస్తుతం 21.5టి ఎం సి నీరు నిల్వ ఉందని ఇన్ ఫ్లో మరియు అవుట్ ఫ్లో లను నియంత్రించేందుకు ఎల్ఎండి మిడిల్ స్పీల్ వే 4 గేట్లను తెరచి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. మానేరు నది పరివాహక ప్రాంతాలైన మానకొండూరు, వీణవంక, తహసీల్దార్ల, ఎస్ హెచ్ వో లు, ఆర్ డి ఓ ను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. మానేరు నది సమీపంలో ఉన్న, ప్రక్కన ఉన్న గ్రామాలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులు, మత్స్యకారులు, పశువులు నదిలోకి ప్రవేశ కుండా రెవెన్యూ, పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. చేపల వేటకు వెళ్ళేవారు నదిలోకి వెళ్లరాదని ఆయన తెలిపారు. రౌండ్ ది క్లాక్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్ ఎం డి ఎస్ఈ శివ కుమార్, ఈఈ నాగ భూషణ్ రావు, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్ తిమ్మాపూర్ తహసిల్దార్ శ్రీవాణి, ఎల్ ఎం డి ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.