ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇస్లావత్ రవీందర్ పవార్ నియామకం..

 

పెద్దవంగర అక్టోబర్ 17(జనం సాక్షి )హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర్లోగల ఎల్ హెచ్ పి ఎస్ సెంట్రల్ ఆఫీస్ లో జరిగిన రాష్ట్ర జనరల్ బాడీ మీటింగులో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కొరిపెల్లి గ్రామపంచాయతీకి చెందిన
మాజీ సర్పంచ్ రవీందర్ పవార్ ని, ఎల్ హెచ్చు పి ఎస్ జాతీయ అధ్యక్షుడు మాదాస్ రాం నాయక్,చేతులమీదుగా , జాతీయ ప్రధాన కార్యదర్శి డా.నరేందర్ పవార్ ఆధ్వర్యంలో ఎల్ ఎఫ్ పి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమకపత్రం అందచేయటం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్,జాతీయ ఉపాధ్యక్షుడు వసంత్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి వాసు నాయక్, గోవింద్ నాయక్, రాష్ట్ర మహిళ నాయకురాలు శాంతి , ఉపేంద్ర తదితరులు ఉన్నారు.నియామకం అనంతరం ఇస్లావత్ రవీందర్ పవార్ మాట్లాడుతూ, కేవలం ఎల్ హెచ్ పి ఎస్ చేసిన 25సం. ల పోరాటాల ఫలితంగానే తాండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయని తరువాత నే 3000కి పైగా గిరిజన బిడ్డలు సర్పంచ్ అయ్యారని,10% రిజర్వేషన్లు కేసీఆర్ భిక్ష కాదని అది రాజ్యాంగం కల్పించిన హక్కని, తమ సంఘం దాన్ని సాధించిందని,అలాగే ఆర్థిక రాజకీయ రంగాలలో కూడా రిజర్వేషన్లు వర్తింపచేయలని తనకు ఇచ్చిన బాధ్యతకు కట్టుబడి లంబాడీల సమస్యల పట్ల, వారి హక్కుల పట్ల, వారికి రావాల్సిన నిధుల పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరంతర ఉద్యమాలు కొనసాగిస్తామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్ ఎఫ్ పి ఎస్ లంబాడీ సమాజ్ పరివర్తన్ యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. అలాగే తనపై అత్యంత విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పాలకుర్తి నియోజకవర్గ బహుజన యువనాయకుడు, మలిదశ తెలంగాణ ఓయూ ఉద్యమకారుడు, లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధానకార్యదర్శి డా.నరేందర్ పవార్ జాతీయ, రాష్ట్ర నాయకత్వం అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.