ఎవరికి ఓటేసినా భాజపాకే
ఈవీఎంలు టాంపరింగ్
అరవింద్ కేజ్రీవాల్
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3(జనంసాక్షి):
ప్రజలు ఎవరికి ఓటు వేసినా అది భాజపా ఖాతాలో చేరిపోయేలా ఈవీఎంలను టాంపర్ చేశారంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఈ నెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భాజపా ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల టాంపరింగ్‌కి పాల్పడుతోందని ఆరోపిస్తూ కేజ్రీవాల్ ఈ రోజు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో తాను ఈవీఎంలను తనిఖీ చేయగా నాలుగు మెషీన్లు టాంపర్ అయినట్లు గమనించానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.