ఎసిబి వలలో జనగామ అగ్నిమాపక అధికారి
జనగామ,నవంబర్5(జనంసాక్షి): ఎసిబి వలకు జనగామ అగ్నిమాప శౄఖ అధికారి చిక్కాడు. లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ అధికారి.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బాణాసంచా దుకాణం అనుమతి కోసం జనగామకు చెందిన ఓ వ్యక్తిని రూ. 10 వేలు లంచం ఇవ్వాలని అగ్నిమాపక శాఖ అధికారి సత్యనారాయణ డిమాండ్ చేశాడు. దీంతో బాధిత వ్యక్తి..ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో సోమవారం రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా అగ్నిమాపక శాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముందస్తుగా చేసిన ఏర్పాటు మేరకు అధికారుల వలపన్ని పట్టుకున్నారు.