ఎస్ఎస్సి లో 10/10 సాధించిన మహమ్మద్ షమ్మీరను సన్మానించిన హ్యూమన్ రైట్స్ సభ్యులు
పదవ తరగతి మార్క్స్ జీవితానికి తొలి వెలుగు లాంటిది అధ్యక్షుడు మంగళంపల్లి హుస్సేన్
తొర్రూరు 9 అక్టోబర్ (జనంసాక్షి ) మండలం లోని చర్లపాలెం గ్రామంలో మహమ్మద్ అజీమ్ పాషా, మైరూన, దంపతులకు జన్మించిన మహమ్మద్ సమీరా ఇటీవలే రాసిన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో టెన్ బై టెన్ సాధించిన మహమ్మద్ శమీరాను జాతీయ మానవ హక్కుల అన్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ కమిటీ సభ్యులతో ఘనంగా సన్మానించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 10/10 సాధించడము ప్రభుత్వ పాఠశాలలో చదివి 100% మార్కులు సాధించడం బాసరలో త్రిబుల్ ఐటీలో సీట్ సాధించడం తొర్రూరు డివిజన్ కాకుండా జిల్లాకే గర్వకారణమని అన్నారు, పదవ తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థికి జీవితంలో తొలి వెలుగు లాంటిదని విద్యార్థులకు సందేశం ఇచ్చారు, ప్రతి విద్యార్థి కష్టపడి ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని విద్యార్థులు గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ ప్రెసిడెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మాచర్ల శ్రీనివాస్ మండల ప్రెసిడెంట్ ఉమేష్, జిల్లా ఎన్విరాన్మెంట్ గొల్లపల్లి మహేష్, జిల్లా జాయింట్ సెక్రెటరీ వేర్పుల మహేష్, జిల్లా కమిటీ మెంబర్ గారే వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు,
—