ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం.


రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనంసాక్షి). ఎస్పీ అఖిల్ మహాజన్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూల మొక్కను అందించి ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జర్నలిస్టులకు సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి పరకాల ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షులు అతికం రఘువీర్ ,సహాయ కార్యదర్శి రాపెల్లి భాస్కర్, కోశాధికారి కాయితి మహేందర్, సీనియర్ జర్నలిస్టులు తడుక విశ్వనాథం, మేడి కిషన్, ఆసరి మహేష్, కార్యవర్గ సభ్యులు అహ్మద్ అన్సారీ అలీ, జాన దయానంద్, దాసరి శిరీష, నాయిని బాబు, జక్కని రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.