ఎస్బిఐ భీమాను అందరూ సద్విగనం చేసుకోవాలి… బ్యాంక్ మేనేజర్ సునీత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసాక్షి):- ఎస్బిఐ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నందివనపర్తి ఎస్బిఐ మేనేజర్ సునీత మంగళవారం తెలిపారు. మండల పరిధిలోని నందివనపర్తి ఎస్బిఐ బ్యాంకులో మేడిపల్లి గ్రామానికి చెందిన ఖాతాదారుడు గదల గణేష్ అనారోగ్యంతో మృతి చెందిన ఆయన కుటుంబానికి బీమా రూపాయలు రెండు లక్షలు చెల్లించారు.ఎస్బిఐ బీమా ప్రీమియం చెల్లించిన సందర్భంగా నామినిగా ఉన్న గణేష్ భార్య కృష్ణవేణికి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ.. ప్రజలు అందరూ ఎస్బిఐ అందించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన Rs436, ప్రధానమంత్రి సురక్షిత యోజన Rs20 ఖాతా ద్వా ప్రీమియం చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. జీవన్ జ్యోతి బీమా యోజన 18 సంవత్సరాల వయసు పైబడిన వారి నుండి 50 సంవత్సరాల వరకు, సురక్ష బీమా యోజన 70 సంవత్సరాల వరకు అర్హత కలిగి ఉంటారని అన్నారు. తక్కువ డబ్బులతో ఎక్కువ బీమా సౌకర్యం ఉందని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఖాతాదారులు వినియోగించు కోవాలని కోరారు. కార్యక్రమం లో ఎస్బిఐ క్యాషియర్ సతీష్, సహాయకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.