ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ సంక్షేమ కార్యక్రమం బలహీనవర్గాల అభివృద్ధికి దోహదపడేలా తయారు చేశామని చెప్పారు. ఆర్థిక పద్దులపై చర్చ జరుగుతన్న సందర్భంలో గీతారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్లాన్డ్ బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయించినట్లు తెలిపారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఖర్చు చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని తెలిపారు.