ఎస్సీ బాలికల వసతి గృహాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి

రాజన్నసిరిసిల్ల బ్యూరో. నవంబర్ 02.(జనం సాక్షి).జిల్లాలోను ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి బుధవారంతెలిపారు.
జిల్లాలోని వసతి గృహాలలో కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు కల్పించామని చెప్పారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.యూనిఫాం సౌకర్యం ఉందన్నారు . బేడ్డింగ్ మెటీరియల్, స్కూల్ షూస్, సెట్వర్ కూడ అందిస్తున్నట్లు తెలిపారు. లైబ్రరీ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. గీసర్, ఆరో ఓ వాటర్ ప్లాంట్, జిమ్ సామగ్రి, ఇన్వర్టర్, కంప్యూటర్, టివి వంటి సౌకర్యాలు విద్యార్థినిలు కోసం అందుబాటులో ఉన్నాయని అన్నారు.

షెడ్యూల్ కులాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ హాస్టల్‌ ఎంతో సౌకర్యం గా ఉంటుందని తెలిపారు.
ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.