ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపే పార్టీలకు గుణపాఠం తప్పదు.

మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి చిన్న వెంకటేష్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 27(జనంసాక్షి):

ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపే పార్టీలకు గుణపాఠం తప్పదని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి చిన్న వెంకటేష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జెట్టి చిన్న వెంకటేష్ మాట్లాడుతూ..భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ చూపిన దిశ నిర్దేశాన్ని కాకుండా స్వార్థం కోసం అంగీకరణకు కొందరు వత్తాసు పలుకుతూ మాల మాదిగల పట్ల ఆంతర్యం సృష్టిస్తూనే ఉన్నారని ఆయన విమర్శించారు. గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు 2006 తీర్పు స్పష్టంగా తెలిపినప్పటికీ ఆయా పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని ముసలి కన్నీరు కారుస్తున్నాయని,అలాంటి పార్టీలకు మాలలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎస్సీల రిజర్వేషన్ శాతం పెంచేలా మూకుమ్మడిగా ఉద్యమం చేయాలని జెట్టి చిన్న వెంకటేష్ పిలుపునిచ్చారు.కొందరు పార్టీల ప్రలోభాలకు గురై వర్గీకరణ విషయం పట్ల ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని అది న్యాయబద్ధం కాదన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అందరం గౌరవించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మాల మహానాడు రాష్ట్ర నాయకులు కుందా మల్లికార్జున్, పెరుమల్ల రాజేష్, కుందా వెంకటేష్, జిల్లా నాయకులు రావుల శ్రీనివాసులు, చింత సత్తి, ఆంజనేయులు, పంబల్ల చంద్రశేఖర్, చింత రవి, గేట్ల నరేష్, వాళ్ల చెన్నయ్య, శ్రీధర్, అరుణ్ కుమార్, మల్లేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.