ఎస్సీ వర్గీకరణ చేపట్టి చట్టబద్దత కల్పించాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టి , చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ డిమాండ్‌ చేశారు.శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా ఇంచార్జ్ యాతాకుల రాజన్నమాదిగ అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశానుసారం ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఎనిమిదేళ్లగా తమను మోసగిస్తున్నారన్నారు.ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ చేపట్టి బీజేపీ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్చార్జ్ యాతాకుల రాజన్న మాదిగ,నాయకులు బోడ శ్రీరాములు మాదిగ , దాసరి వెంకన్న , బొజ్జ వెంకన్న , దైదా వెంకన్న , సిరిపంగి లింగస్వామి , దాసరి పవన్, సిరిపంగి గణేష్ , వల్లపట్ల శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు