ఎస్సై అభ్యర్థుల రాత పరీక్ష కేంద్రాల పరిశీలన
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
ఆగస్టు 7న జరగనున్న ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్ష సందర్భంగా బైపాస్ రోడ్డు లోని వివేకానంద, ఎల్ ఎం డి లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలల కేంద్రాలను గురువారం నాడు కరీంనగర్ అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్ పరిశీలించారు.
ఆయా కేంద్రాల్లోని తరగతి గదులు, పార్కింగ్ వివిధ రకాల సౌకర్యాలను పరిశీలించిన అనంతరం ఆయా కళాశాలకు చెందిన యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు విజ్ఞాన్ రావు, శశిధర్ రెడ్డి, ఎస్సై ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు