ఎస్‌బీఐ ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపు

ముంబయి, మే30( జ‌నం సాక్షి) : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా మదుపరులకుతీపి కబురు అందించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. కోటి రూపాయల లోపు  ఎంపిక చేసిన డిపాజిట్లపై 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేటు పెంచింది. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలలోపు  మెచ్యూరిటీ డిపాజిట్లపై వర్తించే వడ్డీరేటును 6.65 శాతంగా నిర్ణయించింది. ఇప్పటి దాకా ఇది 6.4శాతంగా ఉంది. సీనియర్‌ పౌరుల డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఇంతకుముందు  ఇది 7.10శాతంగా ఉంది. ఈ సవరించిన రేట్లు మే 28 నుండి అమలులోకి   వచ్చినట్టు  బ్యాంకు వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఇతర మెచ్యూరిటీలకు వర్తించే  వడ్డీరేటును యథాతథంగా ఉంచింది. ఉదాహరణకు 45 రోజులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5.75 శాతం   46 -179 రోజులకు గాను 6.25 శాతం, 80-210 రోజుల  డిపాజిట్లపై 6.35 శాతం 1వరకు వడ్డీని అందిస్తుంది. 211 రోజుల నుండి ఒక సంవత్సరం  లోపు వాటిపై 6.40 శాతంగానూ, మూడు సంవత్సరాల నుండి ఐదేళ్ల కాలానికి 6.70 శాతం, ఐదునుంచి పది సంవత్సరాల వరకు  డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీరేటును వర్తింప చేస్తుంది.