ఏఆర్ రహమాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి):ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌రహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లో అందించే ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ఫుకౌకా ఫ్రైజ్ కు ఏఆర్‌రహమాన్‌న్‌ను ఫుకౌకా ఫ్రైజ్ కమిటీ నామినేట్ చేసింది.తన మ్యూజిక్‌తో ఆసియా దేశాల సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పినందుకుగాను ఏఆర్ రహమాన్‌కు పురస్కారాన్ని అందజేయనున్నారు. అవార్డు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ‘ఫ్రమ్ ద హర్ట్.. ది వరల్డ్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్’ అంశంపై ప్రసంగాన్ని అందించాలని ఫుకౌకా సిటీ రహమాన్ కు ఆహ్వానాన్ని అందించింది.