ఏఈ నిర్లక్ష్యానికి లక్షల రూపాయలు నీళ్ల పాలు విధుల నుండి తొలగించాలన్న రైతులు
గంగారం నవంబర్ 11 (జనం సాక్షి)
గంగారం మండలం కోమట్లగూడెం గ్రామం ముందు పెద్ద చెరువు నుండి వస్తున్న కాల్వపై కట్టిన కల్వర్టు కుంగిపోవడంతో కలెక్టర్ ప్రత్యేక చొరవతో కల్వర్టు నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల కేటాయించి సంబంధిత గ్రామపంచాయతీ డి ఈ, ఏ ఈ లకు దాని నిర్మాణం పూర్తి చేయాలని కోరారు వెంటనే ఏ ఈ యశ్వంత్ కాంట్రాక్టర్లకు పనిని అప్పగించారు కాంట్రాక్టర్లు త్వరితగతిన పూర్తి చేసినప్పటికీ ఏఈ ఇచ్చిన ఎస్టిమేషన్ కరెక్ట్ గా లేనందున దాని కింద 150 ఎకరాల వరి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది వరి పొలాలు పొట్ట కొచ్చిన సమయంలో నీళ్లు అందకపోవడంతో రైతులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు వెంటనే నిర్మించిన కల్వర్టును కూల్చివేసి రైతుల పొలాలకు నీళ్లు అందేలా చేయాలని కలెక్టర్ నీ వేడుతున్నారు కల్వర్టు నిర్మాణం కోసం లక్షల రూపాయలు వెచ్చించిన ఏ ఈ యశ్వంత్ నిర్లక్ష్యానికి నీళ్లపాలుగా మారింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఈ యశ్వంత్ ని వెంటనే విధుల నుండి తొలగించాలని రైతులు కోరుకున్నారు