ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన జడ్పిటిసి
పలువురు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన నాగమణి
అశ్వరావుపేట, అక్టోబర్ 10( జనం సాక్షి ) జరగబోయే ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనందుకు ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణికి అవకాశం వచ్చింది. నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో సరోజినీ పురం గ్రామం మద్దిశెట్టి సత్యప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పిటిసి నాగమణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గాల నుంచి ఇద్దరు పిసిసి మెంబర్లు ఉంటాయని, నియోజకవర్గంలో ఏ బ్లాక్ బి బ్లాక్ ఓటు వేసే హక్కు కల్పిస్తారని తెలిపారు. 238 పీసీసీ మెంబర్లు అధ్యక్షుడికి ఓటేస్తారని తెలిపారు. ఓటు వేసే హక్కు నాకు కల్పించారని ఆమె తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదెం వీరయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు. 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎటువంటి ప్రలోభాలకు బెదరకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశానన్నారు. దమ్మపేట మండలంలోని మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శిగా, టి పి సి సి మెంబర్ గా ఉండి కృషి ఫలితంగా ములకలపల్లి జడ్పిటిసి గా ప్రజల పక్షాన ఉండే భాగ్యం కలిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోచీకటి శ్రీనివాసరావు, కందుల వెంకటేశ్వరరావు, కూకల కంటి నాగబాబు, ఎండి జానీ, తిరుపతిరావు, చిన్న శెట్టి చిట్టిబాబు, వి.శ్రీనివాసరావు, చిలక శ్రీను చీకటి శ్రీనివాసరావు, చీకటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.