*ఏకలవ్యుని ధైర్య సాహసాలను పుణికి పుచ్చు కోవాలి ఎమ్మెల్యే బొల్లం*
కోదాడ సెప్టెంబర్ 21 (జనం సాక్షి)
మండల కేంద్రంలోని ఏకలవ్యుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కుతాటి కుమార్ తో కలిసి ఏకలవ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేయబోతున్న గిరిజన బంధుతో ఎరుకల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఏకలవ్యుని ధైర్యసాహసాలకు గురు భక్తికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఆలయాల నిర్మాణం తో భవిష్యత్ తరాలకు ధైర్య సాహసాలు గల వీరుల చరిత్ర తెలుస్తుందన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని అన్నారు. ఏకలవ్యుడి వంటి గొప్ప వీరుడు భారతదేశంలో పుట్టడం పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఏకలవ్యుని ధైర్యసాహసాలను యువతకు పుణికి పుచ్చు కోవాలన్నారు. ఏకలవ్యుని గురుభక్తిని అలవర్చుకొని విలువలతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని ఎరకలు కులస్తులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను విశ్వాసాలను గౌరవిస్తుంది అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎరుకుల సంఘం నాయకులు మరియు జిల్లా నాయకులు రాష్ట్ర మహిళా నాయకురాలు శ్యామల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షం వెలుగు లింగయ్య గ్రామ అధ్యక్షులు సుల్తాని అచ్చయ్య కార్యదర్శి వీరబాబు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు మిగతా ఇరుకుల సంఘం నాయకులు మహిళలు తదితరులు .ఎరకల సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాస్, రఘు, విగ్రహాదాత కస్తూరి సైదులు,మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, స్వతంత్ర సమరయోధులు దొడ్డ నారాయణరావు, సొసైటీ చైర్మన్ అల్సాకాని జనార్ధన్, సర్పంచ్ బాబు, ఎంపిటిసి రమణ నాగయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు పాషా, రాంబాబు, , తదితరులు పాల్గొన్నారు.
Attachments area