ఏక్తాయాత్రకు ఘన స్వాగతం
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడు మహిళ రాజ్యలక్ష్మి చేపట్టిన యాత్ర పట్టణానికి చేరుకున్నది మధురై నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్ వరకు 4,450 కిలోవిూటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. బుల్లెట్‌పై వచ్చిన ఆమెను దోబీ ఘాట్ వద్ద ఘనంగా స్వాగతం పలికి పెర్కిట్ హైవే వరకు ఆమెతో బైక్ ర్యాలీతో భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో ర్యాలీ నిర్వహించి పెర్కిట్ చౌరస్తాలో ఆమె సంకల్పించిన ఏక్తా ర్యాలీ విజయవంతం కావాలని కోరుతూ పట్టు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పెద్దోళ్ల గంగారెడ్డి, బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్‌కుమార్, పోల్కం వేణు, నల్ల రాజారాం, కలిగోట ప్రశాంత్, భరత్ బీజేపీ, బీజేటవైఎం, భజరంగ్ దళ్ నాయకులు ఆమెకు ఘనంగా బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.