ఏజెన్సీలో తన పంజాను జూలిపిస్తున్న లంపి వైరస్

పదుల సంఖ్యలో వైరస్ సోకిన పశువులు

అటుగా కంటికి కానరాని పశు వైద్యులు

అది వైరస్ అని రిపోర్టర్ చెప్పేదాకా తెలియని పరిస్థితి
గంగారం అక్టోబర్ 22 (జనం సాక్షి)
గంగారం మండలం లోని పూనుగొండ్ల, కామారం, మర్రిగూడెం గ్రామాల్లో పదుల సంఖ్యలో పశువులకు లంపి వైరస్ సోకింది. అక్కడి రైతులకు అది ఒక భయంకరమైన వైరస్ అని తెలియకపోవడం ఒక న్యూస్ రిపోర్టర్ ఈ వైరస్ పశువులకు ఎప్పటినుంచి వస్తుందని అడిగే వరకు కూడా వారికి అది వైరస్ అని తెలియకపోవడం చాలా బాధాకరం. పశు వైద్య అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం వైద్యులు జీతాల కోసమే పని చేస్తున్నారా అనే దానికి ఇదే అర్థం. రాష్ట్ర ప్రభుత్వం పశుసంపదని అభివృద్ధి చేయడానికి ఎన్నో పథకాలను రవాణా ఇబ్బందులు ఉండకూడదని అంబులెన్స్ల సదుపాయం కల్పించినప్పటికీ వైద్య అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఏజెన్సీలోని రైతుల పశువుల మందలకు మందలే చనిపోయే ప్రమాదం ఉందని ఇకనైనా ప్రభుత్వ ఉన్నత అధికారుల చొరవతో అక్కడి రైతులకు పూర్తిగా అవగాహన కల్పించి వెంటనే వైరస్ సోకిన పశువులకు వైద్యం అందించాలని కోరారు .