ఏటా రూ.100 కోట్లు
ఇంటిగ్రేటెడ్ యాక్షన్ కింద జిల్లాకు ఏటా రూ. 100కోట్లు మంజూరు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాకు రూ. 70కోట్లు మంజూరు కాగా మరిన్ని నిధులు రానున్నాయి. కాగా నక్సలైట్ల ప్రాబల్యమున్న తూర్పు డివిజన్‌లో మంథని, మహాముత్తారం, మహదేవపూర్ తదితర ప్రాంతాలకే సింహభాగం నిధులు కేటాయించారు. జిల్లాకు ముంజూరైన రూ. 70కోట్లలో రహదారులు, మురుగునీటి కాలువలు, అంగన్‌వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపడతారు. రహదారులకు రూ. 30కోట్లు మంజూరు కాగా తూర్పు ప్రాంతంలో రూ. 23కోట్లు, పశ్చిమ ప్రాంతంలో రూ. 7కోట్లు కేటాయించారు. నిధుల కేటాయింపులో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఓఎస్డీ భాగస్వాములవుతారు. ప్రస్తుతం మంజూరైన నిధులు, చేపట్టిన పనుల విషయమై జిల్లా కలెక్టర్ ప్రతి వారం సమీక్ష జరుపుతున్నారు.