ఏపీలో మహిళా క్రికెట్ టోర్నమెంట్
అంతర్జాతీయ మహిళా క్రికెట్ టోర్నమెంట్‌కు విజయవాడ వేదిక కానుంది. వెస్టిండీస్-భారత్ మహిళా క్రికెట్ జట్ల మధ్య అంతర్జాతీయ వన్డే, టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని మూలపాడు స్టేడియంలో ఈనెల 10 నుంచి 22 వరకు టోర్నమెంట్ జరగనుంది. ఇరు జట్లు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. వెస్టిండీస్, భారత్ జట్టు సభ్యులు ఆదివారం విజయవాడ చేరుకున్నారు. ప్రత్యేక బస్సుల్లో గేట్‌వే హోటల్‌కు చేరుకున్న క్రీడాకారులకు ఘనస్వాగతం పలికారు.