ఏపీ అధికారులు కావాలనే గైర్హాజరయ్యారు
` ఉద్దేశపూర్వకంగానే కేఆర్‌ఎంబీ సమావేశానికి రాలేదు
` తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా
హైదరాబాద్(జనంసాక్షి): కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. భేటీలో తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ పాల్గొన్నారు. ఇవాళ్టి సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరుకాకపోవడంతో గురువారం మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఏపీ అధికారులు హాజరుకాకపోవడంపై రాహుల్ బొజ్జా అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు సమావేశం ఏర్పాట్లు చేస్తే.. ఉద్దేశపూర్వకంగానే ఏపీ అధికారులు రాలేదని పేర్కొన్నారు. తన వాదనలు రికార్డు చేసి కేంద్రానికి పంపాలని కోరారు. శ్రీశైలం, సాగర్ నుంచి మే వరకు తమకు 55 టీఎంసీల నీరు కావాలని ఇప్పటికే ఏపీ సర్కారు ప్రతిపాదించింది. శ్రీశైలం, సాగర్ నుంచి మే వరకు తమకు 63 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ కోరింది.