ఏపీ పోలీసు బాస్‌గా ఆర్పీ ఠాకూర్
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, జూన్30(జనం సాక్షి): ఏపీ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఠాకూర్ నియామకాన్ని ఖరారు చేస్తూ సీఎం చంద్రబాబు శనివారం ప్రకటించారు. డీజీపీ పోటీలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, ఠాకూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. దశల వారీ ముమ్మర కసరత్తు చేశారు. శనివారం తన నివాసంలో ¬ంశాఖ ముఖ్య అధికారులతో డీజీపీ ఎంపికపై సవిూక్ష నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం ఠాకూర్ పేరును ప్రకటించి సీఎం కడప పర్యటనకు బయలుదేరి వెళ్లారు. దీంతో కొత్త డీజీపీగా ఠాకూరు నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్పీ ఠాకూరు ప్రస్తుతం అనిశా డీజీగా పనిచేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక బాధ్యతలు నిర్వర్తించిన ఠాకూర్..
1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఠాకూరు.. ఉమ్మడి రాష్ట్రంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 1961 జులై 1న జన్మించిన ఆర్పీ ఠాకూరు పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్. ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. 1986 డిసెంబర్ 15న ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడవిూలో అదనపు ఎస్పీగా ఆయన తొలి నియామకం జరిగింది. గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ఏఎస్పీగా, పశ్చిమగోదావరి, కడప,
కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. జోనల్ హైదరాబాద్ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పనిచేశారు. 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అనిశా డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సమర్థవంతంగా విధులు..
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అవినీతి ఎక్కువైందని జాతీయస్థాయిలో అనేక సర్వేలు వెల్లడించాయి. దీంతో సమర్థవంతమైన అధికారిని నియమించాలని ప్రభుత్వం భావించింది. అప్పటికి రాష్ట్ర శాంతిభద్రతల అడిషనల్ డీజీగా పనిచే ఠాకూర్ సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం డీజీపీగా పదోన్నతి ఇచ్చి ఏసీబీ డీజీగా నియమించింది. తత్ఫలితంగా ఏడాదిన్నరలోనే రాష్ట్రంలో అవినీతి తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వ శాఖల్లో కీలక స్థానాల్లో ఉంటూ వందల కోట్లు అవినీతికి పాల్పడిన తిమింగిలాల చిట్టాను ఠాకూర్ బయటపెట్టారు. అంతేకాదు ఆదాయానికి మించిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో గేదెల లక్ష్మీగణెళిశ్వరరావు ఆస్తులను ప్రభుత్వపరం చేశారు.
మరోవైపు ఏపీ రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య వీడ్కోలు సందర్భంగా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.
అందుకున్న మెడల్స్..
– 2003లో ఇండియన్ పోలీసు మెడల్
– 2004 లో ఏఎస్‌ఎస్సీ మెడల్ సాధించిన ఠాకూర్
– పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల విూదుగా మెడల్