**ఏబీవీపీ బంద్‌ విజయవంతం*

పెద్దేముల్ ఆగస్టు 23 (జనం సాక్షి)
అధిక ఫీజులు వసూలు చేస్తూ, విద్యను వ్యాపారంగా చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డు పర్యవేక్షణ లోపం, ప్రభుత్వ నియంత్రణను నిరసిస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ మంగళవారం ఇచ్చిన కళాశాలల బంద్ విజయవంతమైంది.
పెద్దేముల్ మండలంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునేశ్వర్ చారి ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలను బంద్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మౌనేశ్వర్ చారి మతడుతూ…తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వం నియంత్రణ చేయడంలో విఫలమైందని అన్నారు.ఇంటర్ బోర్డ్ పర్యవేక్షణ లేకపోవడంతో విద్యను వ్యాపారంగా చేస్తున్నాయని తెలిపారు. ఫీజుల దోపిడీకి కార్పొరేట్ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థుల తల్లిదండ్రులు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు.ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అధిక ఫీజులు నియంత్రించేలా ప్రభుత్వం ఇంటర్ బోర్డ్ చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడిన విద్యార్థులకు కళాశాల సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఘటనకు కారణమైన నారాయణ విద్యాసంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శివప్రసాద్, మహేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.