ఏసీబీ వలలో ధరణి ఆపరేటర్

(జనం సాక్షి  )       27  శ్రీరాంపూర్: పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం తాసిల్దార్
కార్యాలయంలో వారధి ద్వారా ఎంపికైన ధరణి ఆపరేటర్ పోలు కుమార్ స్వామి అను అతను జపాన్ ఖాన్ పేట కు చెందిన రాపల్లి సంతోష్ కుమార్ రైతు వద్ద 7500
రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు శనివారం రోజున తాసిల్దార్ కార్యాలయంలో పట్టుకోవడం జరిగింది. వివరాలకు వెళితే జాఫర్ ఖాన్ పేట కు చెందిన రాపల్లి సంతోష్ కుమార్ అను రైతుకు 5 ఎకరాల భూమి కలదు. ఇతను కూనారం కేడీసీసీ బ్యాంకులో తనకు ఉన్నటువంటి భూమిని మార్ట్ గేజ్ నిమిత్తం ఆ బ్యాంకు వారికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ రైతు వద్ద ఎకరానికి రెండు వేల చొప్పున లంచం డిమాండ్ చేయగా సంబంధిత రైతు నాకు డబ్బులు లేకనే నాకు ఉన్నటువంటి భూమిని బ్యాంకుకు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాను. నీకు ఎలా ఇవ్వాలని అనగా పైసలు ఇస్తేనే పని అయితది లేకుంటే లేదని ఒత్తిడి చేయడం వలన సదరు రైతు ఏమి చేయలేక అతని మిత్రుడు అయినటువంటి యాదగిరి శ్రీనివాసులు ను ఆశ్రయించగా అతను ఇచ్చిన సలహా మేరకు కరీంనగర్ ఏసీబీ అధికారి భద్రయ్య కు కలిసి తన గోడును చెప్పుకోగా వివరాలు సేకరించి మీ సేవలో గత 25వ తేదీన స్లాట్ బుక్ చేసుకోగా 27వ తేదీ అయిన శనివారం రోజున రిజిస్ట్రేషన్ కు రాగా ఏసిబి అధికారులు చెప్పిన ప్రకారం తన స్నేహితునితో పంపించినటువంటి 7500 ధరణి ఆపరేటర్ కుమార్ కు కార్యాలయంలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారణ చేయగా పాజిటివ్గా తేవడం జరిగిందని ఏసీబీ అధికారి భద్రయ్య మీడియాకు వివరించడం జరిగింది. ధరణి ఆపరేటర్ కుమార్ ను ఏసీబీ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు పరుస్తామని విలేకరులకు తెలుపడం జరిగింది