ఏ పార్టీలో చేరను

2

ఎవరికీ మద్దతివ్వను

అన్నాహజారే

న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి): కిరణ్‌బేడీ బీజేపీలో చేరుతున్నట్లు తనకు చెప్పలేదని సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. లోక్‌పాల్‌పై తాను ఒక్కడినే పోరాడుతానని పేర్కొన్నారు. కేజీవ్రాల్‌, కిరణ్‌బేడీలు లోక్‌పాల్‌ బిల్లును మరిచిపోరనే భావిస్తున్నానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తనకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో ఏరాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని తెలిపారు. లోక్‌పాల్‌పై అన్నాహజారే దీక్ష చేపట్టిన సమయంలో కేజ్రీవాల్‌, కిరణ్‌బేడీలు ఆయన వెన్నంటి ఉన్నారు. క్రితం విధానసభ ఎన్నికల్లో ఆప్‌ అధినేక కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ మద్ధతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే సంపూర్ణ మద్ధతు లభించక ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆయన తిరిగి ఇప్పుడు బరిలో నిలిచారు. అనూహ్యంగా ఈ సారి బీజేపీ కిరణ్‌బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించడంతో దిల్లీ విధానసభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. సర్వేలన్నీ హంగ్‌ దిశగా సంకేతాలిస్తున్న నేపథ్యంలో ఈ ఇరువురిలో ఎవరు గద్దెనెక్కుతారనేది ఆసక్తిగా మారింది. అయితే లోక్‌పాల్‌ కోసం విశేషంగా ఆందోళనలు నిర్వహించిన ఈ ఇరువురిలో తాను ఎవరి పక్షం వహించేది లేదని అన్నా హజారే స్పష్టంచేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్ధతు ఇవ్వనని తేల్చిచెప్పారు.