ఐఐటీలో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలు

` జెఇఇ మెయిన్‌ ఫలితాలు విడుదల

న్యూఢల్లీి,ఫిబ్రవరి11(ఆర్‌ఎన్‌ఎ): దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న  జేఈఈ మెయిన్‌ ఫలితాలు వచ్చేశాయి. సోమవారం మధ్యాహ్నం ఫైనల్‌ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు.. తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్‌ -1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,11,544 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 12,58,136మంది హాజరయ్యారు.  ఈ ఫలితాల్లో 14మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోరుతో అదరగొట్టారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత ఉండటం విశేషం. జేఈఈ (మెయిన్‌) పేపర్‌ -2 (బీఆర్క్‌/బి ప్లానింగ్‌) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడిరచింది. ఏప్రిల్‌ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు జరుగుతాయి. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండిరటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్‌ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.