ఐక్యమత్యమే మహాబలం.

జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్.
జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమ్ముగూడ గ్రామ ప్రజలు ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు సైడ్ డ్రైనేజీలు సిసి రోడ్డు పాఠశాలలోనీ మందిర నిర్మాణం కమ్యూనిటీ హాల్ నీటి సమస్యపై జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కారాన్ని తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇస్తూ పాఠశాల మరియు నీటి సమస్యలపై ఆ విభాగం అధికారులతో చర్చించి ప్రహరీ గోడ పునర్నిర్మాణం అదనపు గదులు మరమ్మతుల కొరకు విద్యాధికారి తో నీటి సమస్యపై సంబంధిత ఎస్ఇ తో చర్చిస్తామని అన్నారు. బీటీ రోడ్ సైడ్ డ్రైనేజీలు మందిర నిర్మాణం మరియు కమ్యూనిటీ హాల్ కొరకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు యువకులు గ్రామ యువకులు జడ్పీ చైర్మన్ కి పుష్పగుచ్చం  అందించి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సలీం సర్పంచ్ జీవవైవిద్య మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు లక్కారం మాజీ సర్పంచ్ మర్సుకుల తిరుపతి రిటైర్డ్ తాసిల్దార్ శేషారావు దావుల రమేష్ ప్రభాస్ రవి నాయక్ గ్రామస్తులు యూత్ సభ్యులు ఉన్నారు.