ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు నాన్-మెంబర్ హూదా
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు నాన్-మెంబర్ హూదాను అంగీకరించడం చరిత్రను సృష్టించనున్నది. ఈ అంశంపై సాధారణ సభ ఓటు వేసింది. ఈ అంశంపై అమెరికా, ఇజ్రాయిల్ నుండి పెద్ద ఎత్తున వస్తున్న ఒత్తిడి, ఓట్లు, రాజకీయ స్థానాలు గురించి ఆకస్మిక అంచనాలను కాదని ఐక్కరాజ్య సమితిలో పాలస్తీనా హూదా పెంపొందించే ప్రతిపాదనలపై కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశానికి పాలస్తీనా నేషనల్ అధారిటీ అధ్యక్షులు మహ్మద్ అబ్బాస్ హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితిలో పూర్తిస్థాయి అభ్యర్థిత్వం కోసం అబ్బాస్ 14నెలల క్రితమే విజ్ఞప్తి చేశారు. భద్రత మండలిలో అమెరికా దిగ్బంధానికి సంబంధించి ఆయన పిటిషన్‌దాఖలు చేశారు. పాలస్తీనా ప్రజలకు, ఐక్యరాజ్యసమితికి గురువారం ఒక చారిత్రాత్మక రోజు అని ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా ప్రతినిధి రియాద్ మన్సౌర్ తెలిపారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పాత్ర, హక్కులు, చట్టాలపై ప్రభావం పడకుండా పాలస్తీనాకు నాన్ మెంబర్ అబ్జర్వర్ హూదాను అనుమతించే ముసాయిదా తీర్మానంపై సాధారణ సభ ఓటు వేసింది. అంతేకాక పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించడానికి ముగింపు పలికేందుకు మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు కట్టుబడి ఉంటామని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ పేర్కొంది.