ఐటిడిఎ పరిధి స్కూళ్లలో ఇంగ్లీష్ విూడియం స్కూళ్లు
వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
టీచర్లకు ఆంగ్ల ప్రావీణ్యం కోసం శిక్షణ
ములుగు,మార్చి8(జనంసాక్షి):ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిషు విూడియం పాఠశాలలను నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తుంది. కాగా, 2019-20 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంగ్లిషు బోధన జరగనుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలుస్తుంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన ఆవాస ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిషు విూడియం కొనసాగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 104ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 15రోజుల పాటు ఇంగ్లిషు బోధనపై మెళకువలు, అవగాహన కల్పించేందుకు శిక్షణలు ఇస్తున్నారు. 15రోజుల పాటు నిరాటంకంగా కాకుండా నెలకు మూడు రోజుల చొప్పున ఐదు నెలలపాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఇంగ్లిషు బోధన జరగనుంది. ఇందుకోసం ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు అవసరమైన మెటీరియల్ సమకూర్చడంతో పాటు ఆడియో, వీడియో ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో పెద్ద గొల్లగూడెం, తాడ్వాయి, భూపాలపల్లి, చిన్నబోయినపల్లిలో ఈ మేరకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఇంగ్లిషు విూడియం పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థుల కనీసం బేసిక్ నేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు విూడియంలో నడుస్తున్న పాఠశాలలను ఇంగ్లిషు విూడియం పాఠశాలలను మార్చుతున్న విషయం తెలిసిందే. ఒకటవ తరగతి నుంచి ఇంగ్లిషు విూడియం పాఠశాలలను నడిపేందుకు పభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రావిూణ ప్రాంతాల్లో ఇంగ్లిషు విూడియం అందుబాటులో లేకపోవడంతో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో ఏటా వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి చదివిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో 62 మంది ఉపాధ్యాయులకు, వాజేడు మండలం పెద్ద గొల్లగూడెంలో 57మంది, తాడ్వాయి మండల కేంద్రంలో 67మందికి, భూపాలపల్లిలో 63మంది ఉపాధ్యాయులకు వృత్తి శిక్షణ ఇస్తున్నారు. ఇక మూడు నుంచి ఐదవ తరగతి వరకు కూడా ఉన్న పాఠశాలల్లో కూడా క్రమంగా ఇంగ్లిషు బోధన జరిగే అవకాశం ఉంది.